వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.2,28,970

ABN , First Publish Date - 2021-11-22T05:21:02+05:30 IST

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో కార్తీకమాసం ఆదివారం అశేష భక్తజనం స్వామివారిని దర్శించారు.

వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.2,28,970

ఆత్రేయపురం, నవంబరు 21: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో కార్తీకమాసం ఆదివారం అశేష భక్తజనం స్వామివారిని దర్శించారు.  వేలాదిమంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. వి విధ సేవల ద్వారా స్వామివారి ఒక్కరోజు ఆదాయం రూ.2,28,970 ఆదాయం లభించినట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. రాజమహేంద్రవరం విజిలెన్స్‌ డీఎస్పీ ముత్యాల నాయుడు కుటుంబసమేతంగా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.1.75లక్షలు విరాళం

మహారాష్ట్ర పుణెకు చెందిన మంగిపూడి వీరవెంకట సత్యనారాయణ, దీప్తి దంపతులు రూ.50వేలు, మంగిపూడి భైరవప్రసాద్‌, లక్ష్మి దంపతులు రూ.50వేలు స్వామివారి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం సమర్పించారు. కొత్తపేటకు చెందిన కర్రి వీర్రెడ్డి, నాగమణి దంపతులు రూ.45,049, పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముగూడేనికి చెందిన వట్టికూటి రమేష్‌బాబు, అన్నపూర్ణ దంపతులు రూ.10,116, అమలాపురానికి చెందిన వేగేశ్న వీరభద్రరాజు, రజని దంపతులు రూ.10,116, పశ్చిమగోదావరి జిల్లా దిరుసుమర్రుకు చెందిన నక్కా శ్రీనివాస్‌, హేమదంపతులు రూ.10,001 విరాళంగా సమర్పించారు. దాతలకు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు, ఈవో సతీష్‌రాజు అందజేశారు.

అంతర్వేది నిత్యాన్నదానానికి రూ.లక్షా 25వేల విరాళం

అంతర్వేది, నవంబరు 21: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం లో స్వామివారి దర్శనం అనంతరం మలికిపురం మండలం శాలిపేటకు చెందిన కాదంబరి రామారావు, కుటుంబ సభ్యులు రూ.50వేలు నిత్యాన్నదా నానికి విరాళంగా అందించారు. విరాళాన్ని అందించిన దాతలకు ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. అలాగే కాకినాడకు చెందిన పిన్నమరాజు మోహనగిరికుమారవర్మ, శ్రావణి దంపతులు రూ.50 వేలు, పశ్చిమగోదావరి జిల్లా పెదమైనవానిలంకకు చెందిన ఎం.సువర్ణరాజు, మల్లిక దంపతులు రూ.25వేలు నిత్యాన్నదానానికి విరాళాలుగా అందించారు. విరాళాలు అందించిన దాతలను అభినందించి స్వామివారి చిత్రపటాలను బహూకరించినట్టు ఆలయ సహాయ కమిషనర్‌ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. 

రూ.10వేల విరాళం

అయినవిల్లి: అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వరస్వామి అన్నప్రసాద ట్రస్టుకు రాజమహేంద్రవరానికి చెందిన వెన్నెల హరిశంకర్‌ రూ.10వేలు విరాళంగా అందించారు. హరిశంకర్‌ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దాతకు స్వామివారి చిత్రపటాన్ని ఆలయ ఈవో పి.తారకేశ్వరరావు అందజేశారు. 

భీమేశ్వరస్వామికి వెండి త్రిశూలం బహూకరణ

ద్రాక్షారామ, నవంబరు 21: ద్రాక్షారామ భీమేశ్వరస్వామివారికి రాయవరం మండలం మాచవరం గ్రామానికి చెందిన కోనాల తమ్మిరెడ్డి, జయలక్ష్మి దంపతులు వెండి త్రిశూలం బహూకరించారు. 1169 గ్రాములు బరువు రూ.1.5లక్షల విలువైన వెండి త్రిశూలాన్ని ఆలయ సహాయ కమిషనరు కేఎన్‌వీడీవీ ప్రసాద్‌, అర్చకులకు అందజేశారు. అకోనాల తమ్మిరెడ్డి, జయలక్ష్మిదంపతులకు వారు స్వామివారి ప్రసాదం అందజేశారు. 

Updated Date - 2021-11-22T05:21:02+05:30 IST