స్వామివారి ఫ్లెక్సీ చెంతే అన్నప్రాశన

ABN , First Publish Date - 2021-05-02T06:48:57+05:30 IST

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామిపై భక్తులకు అపారమైన విశ్వాసం ఉంది. ఏడువారాలు వెంకన్నదర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం కావడంతో ఉభయ రాష్ట్రాలనుంచి అను నిత్యం వేలాదిమంది భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని కానుకలు సమర్పిస్తున్నారు.

స్వామివారి ఫ్లెక్సీ చెంతే అన్నప్రాశన
ఆత్రేయపురం మండలం వాడపల్లి చెక్‌పోస్టు వద్ద స్వామివారి ఫ్లెక్సీ వద్దే అన్నప్రాశన నిర్వహిస్తున్న దృశ్యాలు

  • - కోనసీమవాసునిపై అపారమైన విశ్వాసం

ఆత్రేయపురం, మే 1: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామిపై భక్తులకు అపారమైన విశ్వాసం ఉంది. ఏడువారాలు వెంకన్నదర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం కావడంతో ఉభయ రాష్ట్రాలనుంచి అను నిత్యం వేలాదిమంది భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని కానుకలు సమర్పిస్తున్నారు. కరోనా ప్రభావంతో వారంరోజులపాటు ఆలయాన్ని మూసివేశారు. సుదూర ప్రాంతాలనుంచి వచ్చిన ఓ జంట తమ చిన్నారికి అన్నప్రాశన నిర్వహించుకునేందుకు శనివారం స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. తీరా ఆలయాన్ని మూసివేశారన్న విషయం తెలియడంతో ఆ శ్రీనివాసుని ఫ్లెక్సీ వద్దే శుభముహూర్త సమయంలో చిన్నారికి అన్నప్రాశన నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. వాడపల్లి చెక్‌పోస్టు వద్ద భక్తులకు ఆలయం మూసివేశారంటూ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీవద్ద ఆ జంట తమ చిన్నారితో ఫ్లెక్సీలో ఉన్న స్వామివారి ఎదురుగా అన్నప్రాశన నిర్వహించి ఆ జంట మొక్కు తీర్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు హల్‌చల్‌ చేశాయి.

Updated Date - 2021-05-02T06:48:57+05:30 IST