ముగిసిన స్వామివారి పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2021-08-20T06:54:49+05:30 IST

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు మూడో రోజు గురువారంతో ఘనంగా ముగిసాయి. స్వామివారి ఆలయ ముఖమండపంలో మూడ్రోజులపాటు వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం బ్రహ్మశ్రీ ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు స్వామివారి పవిత్రోత్సవాలు వేదమంత్రోచ్ఛారణలతో కనులపండువగా నిర్వహించారు.

ముగిసిన స్వామివారి పవిత్రోత్సవాలు
వాడపల్లి వెంకన్న ఆలయంలో వెండి కలశములతో ఆలయ ప్రదక్షిణ నిర్వహిస్తున్న దృశ్యం

  • వెంకన్నకు పవిత్రాలు సమర్పణ
  • కలశములతో ఆలయ ప్రదక్షిణ
  • గోవిందనామస్మరణతో మార్మోగిన కోనేటిరాయుడి దివ్యక్షేత్రం

ఆత్రేయపురం, ఆగస్టు 19: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు మూడో రోజు గురువారంతో ఘనంగా ముగిసాయి. స్వామివారి ఆలయ ముఖమండపంలో మూడ్రోజులపాటు వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం బ్రహ్మశ్రీ ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు స్వామివారి పవిత్రోత్సవాలు వేదమంత్రోచ్ఛారణలతో కనులపండువగా నిర్వహించారు. స్వామివారి మూలవిరాట్‌, ఉత్సవమూర్తులకు పవిత్రాలు సమర్పించారు. దోషపరిహారార్ధం హోమాలు, అభిషేకాలు నిర్వహించారు.  గురువారం స్వామివారికి విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, మహాశాంతి హోమాలు, ప్రాయశ్చిత్త హోమాలు, మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, మహదాశీర్వచనం, నీరాజన మంత్రపుష్పం, తీర్థ, ప్రసాద వితరణ, ఆలయ ప్రదక్షిణ అత్యంత వైభవంగా నిర్వహించారు. వేదఘోష, మంగళవాయిద్యాల నడుమ వెంకన్న దివ్యక్షేత్రం గోవిందనామస్మరణతో మార్మోగింది. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు, ఈవో  సత్యనారాయణరాజు పర్యవేక్షణలో పవిత్రోత్సవాలు నిర్వహించారు. ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-20T06:54:49+05:30 IST