వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ విజయవంతం

ABN , First Publish Date - 2021-06-21T06:09:03+05:30 IST

అమలాపురం డివిజన్‌లో ఆదివారం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ 101శాతం జరిగినట్టు అమలా పురం ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు తెలిపారు.

వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ విజయవంతం

అమలాపురం రూరల్‌, జూన్‌ 20: అమలాపురం డివిజన్‌లో ఆదివారం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ 101శాతం జరిగినట్టు అమలా పురం ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు తెలిపారు. అమ లాపురం అర్బన్‌తో పాటు డివిజన్‌లోని అన్ని మండలాల్లో 41,400 కొవిషీల్డు వ్యాక్సిన్‌ వేయడానికి లక్ష్యంగా నిర్ధేశించారు. సాయంత్రానికి నూరుశాతం వ్యాక్సినేషన్‌ పూర్తికాగా అద నంగా 353మందికి వ్యాక్సిన్‌ వేయడంతో 101శాతం లక్ష్యాన్ని సాధించామని చెప్పారు. అన్నిశాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారన్నారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆర్డీవో తెలిపారు. అమలాపురం మండలంలో పేరూరు, కామనగరువు, వన్నెచింతలపూడి, బండారులంక జడ్పీ ఉన్నత పాఠశాలల్లో 2,600మందికి వ్యాక్సిన్‌ వేసినట్టు ఇన్‌చార్జి ఎంపీడీవో జి.మల్లికార్జునరావు తెలిపారు. పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్‌ ఎం.వాసునాయక్‌, డాక్టర్‌ ములపర్తి శాంతిలక్ష్మిల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్ర మంలో సర్పంచ్‌ నక్కా అరుణకుమారి, కార్యదర్శులు రుద్ర రాజు ఎస్‌ఎస్‌ సూరపరాజు, ఏఎస్‌వీఎస్‌ రాజేశ్వరరావు, పి.ఆదినారాయణ, జీఎస్‌ నారాయణరావు  పాల్గొన్నారు.
జిల్లాలో 1.50 లక్షల మందికి వ్యాక్సిన్‌
మండపేట, జూన్‌ 20: జిల్లాలో ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా ఆది వారం  జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 465 టీకా కేంద్రాల ద్వారా 1.50లక్షల మందికి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేసినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కె.వీఎస్‌.గౌరీశ్వరరావు తెలిపారు. ఆదివారం పట్టణంలోని వ్యాక్సిన్‌ కేంద్రాలను, తాపేశ్వరంలోని టీకా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. తొలుత వేగుళ్ల వీర్రాజు పాఠశాలలో ఏర్పాటుచేసిన కేంద్రంలో టీకా వేస్తున్న తీరును ఆయన పరీశిలించారు. అనంతరం డొక్కా సీతమ్మ భవనం, మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో టీకా శిబిరాలను సందర్శించి వ్యాక్సినేషన్‌ తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ టి.రామ్‌కుమార్‌, ప్రభుత్వ వైద్యులు కల్యాణి, హేమలత, వైద్య సిబ్బంది నీలా రాంబాబు ఉన్నారు.
ద్రాక్షారామ: రామచంద్రపురం మండలంలో ఆదివారం 2,450 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు ఎంపీడీవో నాగేశ్వరశర్మ తెలిపారు. ద్రాక్షారామ, వెల్ల,  చోడవరం, నరసాపురపుపేట, హసన్‌బాద, వెంకటాయపాలెం గ్రామాల్లో కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించారు.  వెల్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాక్సినేషన్‌ను బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పరిశీలించారు.
కపిలేశ్వరపురం: కోరుమిల్లి, కపిలేశ్వరపురం, కాలేరు, కేదార్లంక, వల్లూరు, టేకి కేంద్రాల్లో 2,051మందికి వ్యాక్సిన్‌ వేసారు. కార్యక్రమాన్ని అంగర, వాకతిప్ప, అచ్యుతాపురం వైద్యాధికారులు, ఎంపీడీవో వెంకట్‌రామన్‌ పర్యవేక్షించారు.    

Updated Date - 2021-06-21T06:09:03+05:30 IST