వ్యాక్సినేషన్‌ ప్రణాళికాబద్ధంగా జరగాలి

ABN , First Publish Date - 2021-05-08T06:22:59+05:30 IST

నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, ప్రజలు కూడా సంయమనం పాటించాలని గుడా మాజీ చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ శుక్రవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

వ్యాక్సినేషన్‌ ప్రణాళికాబద్ధంగా జరగాలి

రాజమహేంద్రవరం, మే 7(ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, ప్రజలు కూడా సంయమనం పాటించాలని గుడా మాజీ చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ శుక్రవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.  క్యూపద్ధతి పాటించకపోతే కరోనాను కొని తెచ్చుకున్నట్టేనని హితవు పలికారు. వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద ప్రజల తోపులాటలు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికారులు ప్రణాళికబద్ధంగా వ్యాక్సినేషన్‌ చేస్తే సమస్య ఉండదన్నారు. కరోనా మృతదేహాల అంతిమ సంస్కారాలకు మరోసారి ముందుకు వచ్చిన సామాజిక సేవకుడు అమీర్‌పాషాను ఆయన అభినందించారు. వారికి వాహనాలు అందించిన దాతలను కూడా అభినందించారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం చేతులెత్తేసిందని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నా రంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆక్సిజన్‌ కొరత విపరీతంగా ఉందని, కొరత లేదని హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయడం సరికాదన్నారు. వెంటిలేటర్‌ మీద ఉన్న రోగిని, ఆక్సిజన్‌ లేదని ఉన్నఫళంగా వెళ్లిపోమంటే ఎలాగని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితి విషయంలో జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని గన్ని కృష్ణ కోరారు.

Updated Date - 2021-05-08T06:22:59+05:30 IST