యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా చక్రవర్తి
ABN , First Publish Date - 2021-02-01T05:54:16+05:30 IST
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా టీవీజీజీఆర్‌ఆర్ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శిగా ఎస్.జ్యోతిబసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

గంగవరం, జనవరి 31: యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా టీవీజీజీఆర్‌ఆర్ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శిగా ఎస్.జ్యోతిబసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన జిల్లామహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా పెంకే వెంకటేశ్వరరావు, అసోసియేట్ అధ్యక్షురాలిగా షరీఫ్, విజయగౌరి, కోసాధికారిగా పీవీవీ నాగేశ్వరరావు, ఆడిటింగ్ కమిటీ కన్వీనర్‌గా టీజీ వాషింగ్‌టన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కార్యదర్శులుగా కె.కృష్ణ, జీవీ రమణ, సురేష్‌కుమార్, సాయిరామ్, ఆదిరెడ్డి, వీరబాబు, శ్రీమణి, సురేంద్రకుమార్, ప్రసాద్‌రావు, గణేశ్వరరావులు ఎంపికయ్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, సహాయ ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ వ్యవహరించారు.