గుర్తుతెలియని మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-08-27T06:48:24+05:30 IST

తుని పట్టణంలోని చేపల మార్కెట్‌ ప్రాంతంలో తాండవనదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదే హం గురువారం లభ్యమైంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 50ఏళ్ల వయసు గల వ్యక్తి తాండవ నీటిలో తేలియాడుతున్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

తుని, ఆగస్టు 26: తుని పట్టణంలోని చేపల మార్కెట్‌ ప్రాంతంలో తాండవనదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదే హం గురువారం లభ్యమైంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 50ఏళ్ల వయసు గల వ్యక్తి తాండవ నీటిలో తేలియాడుతున్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ ఎస్‌ఐ శ్రీనివాస్‌కుమార్‌ సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు నీలం, ప చ్చ రంగుపై తెలుపు చార్లతో ఉన్న చొక్కా, నలుపు రంగు ట్రాక్‌ ఫ్యాంటు ధరించి నడుముకు ఎరుపురంగు టవల్‌ చుట్టి ఉంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ జి.రమేష్‌బాబు తెలిపారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రిలో భద్రపర్చినట్టు ఆయన చెప్పారు.

Updated Date - 2021-08-27T06:48:24+05:30 IST