రెండున్నరేళ్లలో సాధించిన ప్రగతేది: వేగుళ్ల

ABN , First Publish Date - 2021-12-08T06:12:53+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తోంది, ఇప్పటివరకు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పండని ఎమ్మెల్సీ తోట త్రీమూర్తులును ఎమ్మెల్యే వేగుళ్లజోగేశ్వరరావు ప్రశ్నించారు.

రెండున్నరేళ్లలో సాధించిన ప్రగతేది: వేగుళ్ల

 మండపేట, డిసెంబరు 7: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తోంది, ఇప్పటివరకు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పండని ఎమ్మెల్సీ తోట త్రీమూర్తులును ఎమ్మెల్యే వేగుళ్లజోగేశ్వరరావు ప్రశ్నించారు. మండపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేగుళ్ల మాట్లాడారు. కల్లబొల్లి మాటలు వద్దని వైసీపీ నేతలకు హితవు పలికారు. రాయవరం మండలం మాచవరంలో వం తెన కూలిపోయి 8నెలలు అయిందని, వంతెన ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. కూలిన వంతెన గురించి ఎమ్మెల్సీ తోట తనపై బురదజల్లే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ సర్పంచ్‌ మేడపాటి రవీంద్రరెడ్డి,  మాచవరానికి చెందిన టీడీపీ నాయకులు కర్రి వెంకటరామారెడ్డి, కొవ్వురి అదిరెడ్డి, మండా రామచంద్రారెడ్డి, నెల్లరాము తదితరులు పాల్గొన్నారు.Updated Date - 2021-12-08T06:12:53+05:30 IST