పాటదారులు గడువులోపు నగదు చెల్లించాలి
ABN , First Publish Date - 2021-03-21T05:37:31+05:30 IST
తుని, మార్చి 20: మున్సిపాలిటీలో పలు ఆశీలు వసూళ్లు చేసుకోవడానికి వేలం ద్వారా పాటను దక్కించుకున్న వారంతా గడువులోపు నగదు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రాజు తెలిపారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో వేలంపాటలను నిర్వహించారు. రోడ్డుమార్జి

తుని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రాజు
తుని, మార్చి 20: మున్సిపాలిటీలో పలు ఆశీలు వసూళ్లు చేసుకోవడానికి వేలం ద్వారా పాటను దక్కించుకున్న వారంతా గడువులోపు నగదు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రాజు తెలిపారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో వేలంపాటలను నిర్వహించారు. రోడ్డుమార్జిన్‌లో ఆశీలు వసూలు చేసుకోవడానికి రూ.15.63లక్షలకు యండపల్లి కాశీవిశ్వనాధం, జనరల్ మార్కెట్ రూ.4,61000 కు పేరూరి బాబురావు, మేకల కబేళాకు రూ.2.35లక్షలకు కూరపాటి శేఖర్, చెట్ల పలసాయం పొందేందుకు రూ.5200కు కూరపాటి శేఖర్‌లు వేలం ద్వారా దక్కించుకున్నారు. గతేడాది కంటే వేలంపాటలు అధికంగా వెళ్లడంతో వారికి ఆమోదం తెలిపారు. దీనిపై కౌన్సిపల్ ఆమోదం తెలపాల్సి ఉంది. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు కే.శ్యామల, కే.శివాజీ, వంశీకిరణ్, సూరిబాబు, ఏసుప్రసాద్, దాసు, అప్పారావ, వరహాలు తదితరులు పాల్గొన్నారు.