కేశవభట్ల ట్రస్ట్‌ సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2021-10-25T05:42:55+05:30 IST

కేశవభట్ల చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వ ర్యంలో రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో ఉద్యోగులకు, పోర్టర్స్‌, వెండర్స్‌ కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవలు అందించడం అభినందనీయమని రైల్వే విజయవాడ సీనియర్‌ డీపీవో జీఆర్‌ సుధీర్‌కుమార్‌ అన్నారు.

కేశవభట్ల ట్రస్ట్‌ సేవలు అభినందనీయం

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 24: కేశవభట్ల చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో ఉద్యోగులకు, పోర్టర్స్‌, వెండర్స్‌ కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవలు అందించడం అభినందనీయమని రైల్వే విజయవాడ సీనియర్‌ డీపీవో జీఆర్‌ సుధీర్‌కుమార్‌ అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో కేశవభట్ల చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కేశవభట్ల శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కేశవభట్ల ట్రస్ట్‌ అద్బుతమైన సేవలు అం దించిందన్నారు. శిబిరంలో రైల్వే హెల్త్‌సెంటర్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌వీఎస్‌ కుమారి, పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి, ఆరోగ్య ఆసుపత్రి డాక్టర్‌  వినోద్‌, రాజు న్యూరో ఆసుపత్రి డాక్టర్‌ సత్యదేవ్‌, లతాస్‌ డెంటిస్ట్‌ అండ్‌ డాంటిస్ట్‌ డాక్టర్‌ శ్యామ్యూల్‌ సిమ్సీ సహకారంతో వైద్యపరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో విజయవాడ రైల్వే ఏసీఎం రవివర్మ, ఆర్‌పీఎప్‌ ఇన్స్‌స్పెక్టర్‌ లక్ష్మి, ఇండ స్ర్టీయల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ కె.సాగర్‌, నేమాని మెహర్‌ విద్యాసాగర్‌, డాక్టర్‌ ఇమామ్‌, సుంకర చంద్రమౌళి, కె.సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T05:42:55+05:30 IST