పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు
ABN , First Publish Date - 2021-02-06T06:40:25+05:30 IST
ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్టు ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ఆదిత్య అన్నారు.

రంపచోడవరం, ఫిబ్రవరి 5: ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్టు ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ఆదిత్య అన్నారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో టూరిజం, గిరిజన సంక్షేమశాఖ, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలశాఖ ఇంజనీర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. మారేడుమిల్లి, వై.రామవరం ఎగువ ప్రాంతాల్లో పర్యాటక ప్రారతాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పర్యాటకం ద్వారా వచ్చిన ఆదాయంలో 10శాతం గిరిజనాభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. గిరిజనులకు శిక్షణనిచ్చి గైడర్స్‌గా ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. గండిపోశమ్మ ఆలయం వేరొకచోట ఏర్పాటుకు పంచాయతీ తీర్మానం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌ఆర్ కాలనీలలో 13 దేవాలయాలు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టరు టీఈఎం రాజు, డీఎం టి.వీరనారాయణ, డీటీ పి.వెంకటాచలం, ఏపీవో పీవీఎస్ నాయుడు, ఎస్‌వో వెంకటేశ్వర్లు, ఈఈలు పి.రమాదేవి, సత్యనారాయణ, డీఈలు పీవీరాజు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.