రైలు ఢీకొని సచివాలయ ఉద్యోగి మృతి

ABN , First Publish Date - 2021-06-21T08:10:50+05:30 IST

గొల్లప్రోలు-పిఠాపురం రైల్వేస్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఆది వారం మధ్యాహ్నం సచివాలయ ఉద్యోగి మరణించాడు. పిఠాపురం పట్టణంలోని కృష్ణుని గుడి వద్ద నివాసముంటున్న మొల్లి మణికంఠ 3వవార్డు సచివాలయంలో ఎమినిటీస్‌ సెక్రటరీగా పనిచేస్తున్నాడు.

రైలు ఢీకొని సచివాలయ ఉద్యోగి మృతి

పిఠాపురం/తుని, జూన్‌ 20: గొల్లప్రోలు-పిఠాపురం రైల్వేస్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఆది వారం మధ్యాహ్నం సచివాలయ ఉద్యోగి మరణించాడు. పిఠాపురం పట్టణంలోని కృష్ణుని గుడి వద్ద నివాసముంటున్న మొల్లి మణికంఠ 3వవార్డు సచివాలయంలో ఎమినిటీస్‌ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఇంటినుంచి బయటకు వెళ్లిన అతను రైలు పట్టా లపై విగతజీవిగా పడి ఉన్నాడన్న సమాచారంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగారు.  రైలు పట్టాలు దాటుతుండగా విశాఖనుంచి విజయవాడ వైపు వెళ్తున్న రైలు ఢీకొని మణికంఠ మరణించినట్లు తుని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. అతడికి ఇటీవల వివాహం నిశ్చమైనట్లు కొద్ది రోజుల్లో ముహూర్తం పెట్టుకోవాలని అనుకుంటుండగా ఇలా జరగడం అతని కుటుంబసభ్యులను కలచివేస్తోంది. తుని రైల్వే ఎస్‌ఐ అబ్ధుల్‌ మారుపు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-21T08:10:50+05:30 IST