ట్రాక్టర్‌పై ఆర్డీవో..!

ABN , First Publish Date - 2021-08-27T06:08:01+05:30 IST

కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ గురువారం కరప సెంట్రల్‌ లేఅవుట్‌ను పరిశీలించేందుకు అధికారులతో కలిసి వచ్చారు.

ట్రాక్టర్‌పై ఆర్డీవో..!

కరప సెంట్రల్‌ లేఅవుట్‌లో ఇళ్లస్థలాల ప్రాంతం పరిశీలన 

కరప, ఆగస్టు 26: కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ గురువారం కరప సెంట్రల్‌ లేఅవుట్‌ను పరిశీలించేందుకు అధికారులతో కలిసి వచ్చారు. లేఅవుట్‌కు వెళ్లే డ్రైన్‌ గట్టు బురదతో నిండిపోవడంతో కార్లు, మోటర్‌సైకిళ్లు వెళ్లే పరిస్థితి లేకపోయింది. దీంతో స్థానిక అధికారులు ట్రాక్టర్‌ను ఏర్పాటు చేయడంతో ఆర్‌డీవోతోపాటు డీటీ పి.శ్రీనివాసరావు, పంచాయతీరాజ్‌, ఆర్‌డ బ్ల్యూఎస్‌ ఏఈలు సిద్ది వెంకటేశ్వరరావు, పోతుల ప్రసాద్‌, మండల సర్వేయర్‌ రామకృష్ణ, ఆర్‌ఐ పేపకాయల మాచరరావు ఆ ట్రాక్టర్‌ ఎక్కి రెండు కిలోమీటర్లకుపైగా దూరం ఉన్న సెంట్ర ల్‌ లేఅవుట్‌లో చెరువు ప్రాంతాన్ని పరిశీలించా రు. దాదాపు 130 ఎకరాలను ఇళ్లస్థలాల కోసం సేకరించగా ఇంకా 46 ఎకరాల వరకు లెవిలింగ్‌ చేయాల్సి ఉంది. అందులో 20 ఎకరాలకుపైగా గతంలో రొయ్యల చెరువులు తవ్విన ప్రాంతం కావడంతో ఫిల్లింగ్‌ చేయడం కష్టతరంగా మా రింది. ఆ చెరువుల్లో ప్రస్తుతానికి మూడు అడు గుల మేర గ్రావెల్‌తో కప్పెంటించాలని ఆర్‌డీవో అధికారులను ఆదేశించారు. 3, 5 లేఅవుట్‌లను కలిపే డ్రైన్‌పై వంతెన నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.Updated Date - 2021-08-27T06:08:01+05:30 IST