ఈసారి రికార్డులే

ABN , First Publish Date - 2021-11-23T07:09:10+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధి కార్తీకమాస మూడో సోమవారం సత్యదేవ నామస్మరణతో మార్మోగింది.

ఈసారి రికార్డులే
అన్నవరంలో సత్యదేవుడి వ్రతాలాచరిస్తున్న భక్తులు..

అన్నవరం సత్యదేవుడి  ఆలయానికి భారీగా భక్తుల రాక

సోమవారం 8,680 వ్రతాలు.. ఆదాయం రూ.75 లక్షలు

ఇప్పటిదాకా 76,894 వ్రతాలు

అన్నవరం, నవంబరు 22 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధి కార్తీకమాస మూడో సోమవారం సత్యదేవ నామస్మరణతో మార్మోగింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని అర్ధరాత్రి ఒంటి గంట నుంచే వ్రతాలు, రెండు గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభించారు. సోమవారం ఒక్కరోజే 8,680 వ్రతాలు జరుగగా వివిధ విబాగాల ద్వారా సుమారు రూ.75 లక్షల ఆదాయం సమకూరింది. 2019లో కార్తీకమాసం మొత్తం 1,36,109 వ్రతాలు జరగగా ఇప్పటివరకు అదే రికార్డు నెలకొంది. గతేడాది కొవిడ్‌ ప్రభావంతో వ్రతాల సంఖ్య పెరగలేదు. అయితే ఈ ఏడాది కార్తీకంలో ఇప్పటివరకు 76,894 వ్రతాలు జరిగినట్టు ఆల య అధికారులు వెల్లడించారు. ఇంకా కార్తీకమాసం ముగియడానికి 12 రోజులు ఉండడం తో మరో 65 వేల వ్రతాల వరకు జరిగి కొత్త రికార్డు నెలకొల్పవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా రాజమహేంద్రవరంలో గోదావరిలో వేకువజామునే మహిళలు పుణ్యస్నానాలు చేసి నదిలో దీపాలు వదిలారు. దీంతో పుష్కరఘాట్‌ వద్ద పెద్దఎత్తున రద్దీ ఏర్పడింది.
Updated Date - 2021-11-23T07:09:10+05:30 IST