దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2021-12-27T05:27:44+05:30 IST

వివిధ పనులపై రాజమహేంద్రవరం వచ్చి రోడ్డు పక్కల వాహనాల్లో నిద్రించిన వారిని గుర్తించి దాడి చేసి డబ్బులు దోచుకుంటున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. త్రీటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం..

దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 26:  వివిధ పనులపై రాజమహేంద్రవరం వచ్చి రోడ్డు పక్కల వాహనాల్లో నిద్రించిన వారిని గుర్తించి దాడి చేసి డబ్బులు దోచుకుంటున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. త్రీటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. కడియపు సావరానికి చెందిన ముప్పన నాగేశ్వరరావు రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో పువ్వులు అమ్ముతుంటాడు. ఈనెల 24న పుష్కరఘాట్‌లో పువ్వులు అమ్మి మిగిలిన వాటిని క్రిస్మస్‌ రోజున అమ్ముకుందామని అక్కడే ఉండిపోయి ఓ ఆటోలో నిద్రించాడు. అర్ధరాత్రి ముగ్గురు బైక్‌పై వచ్చి నాగేశ్వరరావును లేపి బెదిరించి అతడి వద్ద ఉన్న రూ.700 లాక్కుని ఎవ్వరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. దీంతో బాధితుడు ఈనెల 25న త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించి 24గంటల్లో నిందితులను పట్టుకున్నారు. నిందితులు స్థానిక ఉల్లితోట వీధికి చెందిన చిలకలపూడి మోహనరావు, శంకా సతీష్‌, ధవళేశ్వరం ఐవోసీఎల్‌ కాలనీకి చెందిన వేపాడి సతీష్‌కుమార్‌లుగా గుర్తించి వారిని స్థానిక సుబ్రహ్మణ్యం మైదానంలో అరెస్టు చేసి వారి నుంచి రూ.700, బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించినట్టు త్రీటౌన్‌ పోలీసులు తెలిపారు.
 

Updated Date - 2021-12-27T05:27:44+05:30 IST