పిఠాపురంలో చోరీ

ABN , First Publish Date - 2021-08-27T06:59:54+05:30 IST

పట్టణంలోని సీతయ్యగారితోటలోని ఓ ఇంట్లో గురువారం చోరీ జరిగింది. విశాఖపట్నానికి చెందిన రొంగల రాము స్థానికం గా నివాసముంటున్నాడు.

పిఠాపురంలో చోరీ

  • రూ.3లక్షల బంగారు ఆభరణాలు మాయం

పిఠాపురం, ఆగస్టు 26: పట్టణంలోని సీతయ్యగారితోటలోని ఓ ఇంట్లో గురువారం చోరీ జరిగింది. విశాఖపట్నానికి చెందిన రొంగల రాము స్థానికం గా నివాసముంటున్నాడు. ఆయన గొల్లప్రోలు మండలం చేబ్రోలులో గోదా వరి గ్రామీణ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. గుంటూరులో బ్యాం కు ట్రైనింగ్‌ ఉండడంతో కుటుంబసభ్యులను విశాఖపట్నంలో ఉంచాడు. ఈ నెల 22న గుంటూరు వెళ్లి శిక్షణ పూర్తి చేసుకుని గురువారం సాయంత్రం తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి తలుపులు బద్దలుకొట్టి ఉండడాన్ని గుర్తిం చాడు. బీరువాలో ఉన్న 73గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, కొంత నగదు చోరీకి గురైనట్టు గుర్తించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌, ఎస్‌ఐ బి.శంకరరావు, సిబ్బంది వచ్చి ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.

Updated Date - 2021-08-27T06:59:54+05:30 IST