దొంగిలించిన ఎక్స్‌కవేటర్‌ సీజ్‌

ABN , First Publish Date - 2021-11-09T05:43:07+05:30 IST

ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు చేస్తూ రోడ్డు పక్కన నిలిపిన ఎక్స్‌ 200 ఎక్స్‌కవేటర్‌ దొంగిలించగా రంగంపేట పోలీసులు ఈ కేసును చేదించి దాన్ని రికవరీ చేశారు.

దొంగిలించిన ఎక్స్‌కవేటర్‌ సీజ్‌

రంగంపేట, నవంబరు 8: ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు చేస్తూ రోడ్డు పక్కన నిలిపిన ఎక్స్‌ 200 ఎక్స్‌కవేటర్‌ దొంగిలించగా రంగంపేట పోలీసులు ఈ కేసును చేదించి దాన్ని రికవరీ చేశారు. దీనిపై పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు రంగంపేట స్టేషన్‌లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఏడీబీ రోడ్డులో కోటపాడు సత్తెమ్మగుడివద్ద నిలిపి ఉంచిన ఎక్స్‌కవేటర్‌ను ఆగస్టు 12న దుండగులు దొంగిలించారన్నారు. దీనిపై యజమాన్ని రంగంపేట స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడన్నారు. ఈ కేసులో నిందితుడు బిక్కవోలు మండలం బలభద్రపురానికి చెందిన పడాల వెంకటసాయి.. రామారెడ్డి ఎక్స్‌కవేటర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ దాన్ని కొనుగోలు చేసి అమ్మివేసి రూ.15 లక్షల మేర అప్పుల పాలయ్యాడన్నారు. అతడు కోటపాడు వద్ద ఉన్న ఎక్స్‌కవేటర్‌ను గమనించి దొంగిలించాడన్నారు. రెండునెలల తర్వాత అనపర్తి మండలం దుప్పలపూడిలోని ఓ క్వారీ లో మిషన్‌ తనదేనంటూ నమ్మించి పని ప్రారంభించాడన్నారు. 20 రోజులు పని తర్వాత పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు నిందితుడిని అరెస్టు చేసి, ఎక్స్‌కవేటర్‌తోపాటు సెల్‌ఫోన్‌, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. పెద్దాపురం సీఐ కేఎన్వీ జయకుమార్‌, ఎస్‌ఐ రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T05:43:07+05:30 IST