దారి దోపిడీ కేసులో ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2021-03-21T05:56:00+05:30 IST

దారి దోపిడీ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి సుమారు ఇరవై సెల్‌ఫోన్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు జగ్గంపేట సీఐ సురేష్‌బాబు, ఎస్‌ఐ శోభన్‌కుమార్‌ తెలిపారు.

దారి దోపిడీ కేసులో ఇద్దరి అరెస్టు

గండేపల్లి, మార్చి 20: దారి దోపిడీ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి సుమారు ఇరవై సెల్‌ఫోన్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు జగ్గంపేట సీఐ సురేష్‌బాబు, ఎస్‌ఐ శోభన్‌కుమార్‌ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ సురేష్‌బాబు మాట్లాడుతూ ఈనెల 5వ తేదీన జగ్గంపేట జేవీఅర్‌ కాంప్లెక్స్‌ వద్ద రాత్రి సమయంలో రాజమహేంద్రవరం వెళ్లేందుకు ఒక వ్యక్తి వేచి ఉండగా రంగంపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌పై  వచ్చి రాజమహేంద్రవరం వరకు డ్రాప్‌ చేస్తామని ఎక్కించుకున్నారన్నారు. తాళ్లూరు నుంచి సైడ్‌రోడ్‌లోకి తీసుకెళ్లి దాడిచేసి అతని వద్ద నుంచి సెల్‌ఫోన్‌, వెయ్యి రూపాయలు దొంగలించారన్నారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా ఉంచి శుక్రవారం రాజానగరం వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇటువంటి దొపిడీలకు పాల్పడుతున్నారన్నారు. 

Updated Date - 2021-03-21T05:56:00+05:30 IST