ఉత్సాహంగా టెన్నిస్‌ పోటీలు

ABN , First Publish Date - 2021-03-01T05:57:42+05:30 IST

కాకినాడ స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 28: జిల్లా లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన కాకినాడ ఆర్‌ఎంసీ ప్రాంగణంలో ఆదివారం జిల్లా స్థాయి టెన్నిస్‌ పోటీలు, ఎంపికలు

ఉత్సాహంగా టెన్నిస్‌ పోటీలు

కాకినాడ స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 28: జిల్లా లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన కాకినాడ ఆర్‌ఎంసీ ప్రాంగణంలో ఆదివారం జిల్లా స్థాయి టెన్నిస్‌ పోటీలు, ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. పోటీలను ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.బాబ్జి ప్రారంభించారు. రాష్ట్ర టెన్నిస్‌ సంఘం కార్యదర్శి రామ్‌కుమార్‌ మాట్లాడుతూ అండర్‌- 10, 12, 14 విభాగాల్లో బాలురు,బాలికల విభాగంలో జిల్లా జట్టు ఎంపిక నిర్వహించామన్నారు. అండర్‌-10,12 విభాగంలో 10 మంది బాలురు, బాలికలను... అండర్‌-14లో బాలురు 5, బాలికలు ముగ్గురిని ఎంపిక చేశామన్నారు. ఆర్‌ఎంసీ పీడీ డాక్టర్‌ కె.స్పర్జన్‌రాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T05:57:42+05:30 IST