టీచర్ సస్పెన్షన్
ABN , First Publish Date - 2021-11-28T05:57:56+05:30 IST
ఎస్.యానాం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వి.మల్లేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాఽధికారి ఎస్.అబ్రహాం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈవో కార్యాలయం ప్రకటించింది.

ఉప్పలగుప్తం, నవంబరు 27: ఎస్.యానాం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వి.మల్లేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాఽధికారి ఎస్.అబ్రహాం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈవో కార్యాలయం ప్రకటించింది. మల్లేశ్వరరావు ఫోన్‌లో విద్యార్థినులతో అసభ్యకరంగా సంభాషిస్తున్నట్టు అందిన ఫిర్యాదులపై దర్యాప్తు అనంతరం సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టు డీఈవో పేర్కొన్నారు.