హెచ్‌ఎం వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-01-13T05:53:43+05:30 IST

ప్రధానోపాధ్యాయుని వేధింపులు తాళలేక ఓ ఉపాధ్యాయిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది.

హెచ్‌ఎం వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం

కాకినాడ క్రైం, జనవరి12: ప్రధానోపాధ్యాయుని వేధింపులు తాళలేక ఓ ఉపాధ్యాయిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. కాకినాడ జె.రామారావుపేట సమ్మిడివారి వీధికి చెందిన 38 ఏళ్ల అడబాల వీరనాగదేవి ముత్తానగర్‌ యాళ్లవారి గరువులోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌లో 2012 నుంచి కాంట్రాక్ట్‌ డ్రాయింగ్‌ టీచర్‌గా పని చేస్తోంది. అయితే ఆ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడైన హలీమ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఒక పూట ఉద్యోగం చేయాల్సిన ఆమెను రెండు పూటలు పని చే యాలని వేధిస్తున్నారు.  హలీమ్‌ సోమవారం కూడా ఆమెను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టడంతో  ఇంటికి వెళ్లిన అనంతరం నిద్ర మాత్రలు మింగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు 108 వాహనంపై జీజీహెచ్‌కు తరలించగా ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతోంది. వన్‌టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-13T05:53:43+05:30 IST