‘అగ్రి’ బాధితులను ఆదుకోవడంలో విఫలం
ABN , First Publish Date - 2021-08-26T05:25:42+05:30 IST
తొండంగి, ఆగస్టు 25: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు విమర్శించారు. ఒంటిమామిడిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రూ.20వేలలోపు డిపాజిట్ చే

టీడీపీ తుని ఇన్‌చార్జి యనమల కృష్ణుడు
తొండంగి, ఆగస్టు 25: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు విమర్శించారు. ఒంటిమామిడిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రూ.20వేలలోపు డిపాజిట్ చేసినవారు 6లక్షలమంది ఉండగా 4లక్షలమందికి మాత్రమే సహాయం అందించడం ద్వారా మిగిలినవారి గొంతు కోసినట్లయిందన్నారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ సొంతవారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిం చారు. సమావేశంలో తెలుగు రైతు కార్యనిర్వహక కార్యదర్శి పేకేటి హరికృష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు కోడా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.