బీసీలకు పెద్దపీట వేసిన టీడీపీ

ABN , First Publish Date - 2021-08-25T05:38:17+05:30 IST

రామచంద్రపురం, ఆగస్టు 24: మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ వ్యవస్థను తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పదవులు కల్పించి పెద్దపీట వేసింది టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ అని రామచం ద్రపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. పట్టణంలోని బలుసు వెంకట్రాయుడు కల్యాణ మండపంలో మంగళవారం పార్టీ కార్యకర్తల సమావేశం పట్టణాధ్యక్షుడు కడియాల రాఘవన్‌ ఆధ్వర్యంలో

బీసీలకు పెద్దపీట వేసిన టీడీపీ
సమావేశంలో మాట్లాడుతున్న రెడ్డి సుబ్రహ్మణ్యం

రామచంద్రపురం ఇన్‌చార్జ్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం 

రామచంద్రపురం, ఆగస్టు 24: మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ వ్యవస్థను తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పదవులు కల్పించి పెద్దపీట వేసింది టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ అని రామచం ద్రపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. పట్టణంలోని బలుసు వెంకట్రాయుడు కల్యాణ మండపంలో మంగళవారం పార్టీ కార్యకర్తల సమావేశం పట్టణాధ్యక్షుడు కడియాల రాఘవన్‌ ఆధ్వర్యంలో జరిగింది. అధ్యక్షత వహించిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం బీసీలకు అధికారం ఇవ్వకుండా నామమాత్రపు పదవులు ఇచ్చిందని విమర్శించారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీల కు రిజర్వేషన్లు కల్పించడం వల్లే మంత్రి వేణుగోపాలకృష్ణకు అప్పట్లో జడ్పీ చైర్మన్‌ పదవి వచ్చిందన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. రామచంద్రపురం నియోజకవర్గానికి తాను లోకల్‌ అని, తన మాతృ నియోజకవర్గానికి ప్రజాసేవ చేసేందుకు అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అమలాపురం పార్లమెంటరీ ఎన్నికల పరిశీలకుడు, మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణమూర్తి మాట్లాడుతూ సంక్షేమ పథకాల పేరుతో పేదలను మభ్య పెడుతూ రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటామని హామినిచ్చారు. అమలాపురం పార్లమెంటరీ ఇన్‌చార్జ్‌ గంటి హరీష్‌ మాధుర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, కార్యకర్తలందరూ ప్రతిఘటించాలన్నారు. మూడు మండలాల టీడీపీ అధ్యక్షులు పెంకె సాంబశివరావు, సలాది సాయిబాబా, వెదుర్లయ్య, సీనియర్‌ నాయకులు గరిగిపాటి సూర్యనారాయణ, జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ చింతపల్లి వీరభద్రరావు, అక్కల యశ్వంత్‌రాయ్‌, చోడవరం శ్రీను, పెందుర్తి భానుమూర్తి, చింతపల్లి అర్జున్‌, ఉండూరు సర్పంచ్‌ సాయి, టీడీపీ మహిళా విభాగం నాయకురాలు జాస్తి విజయలక్ష్మి, జొన్నకూటి భాస్కరరావు, గుబ్బల బాలగోపాలం పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-25T05:38:17+05:30 IST