దాడులన్నీ వైసీపీ ప్రేరేపిత ఉగ్రవాదమే

ABN , First Publish Date - 2021-10-22T05:05:33+05:30 IST

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 21: రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులన్నీ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమేనని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఆరోపించారు.

దాడులన్నీ వైసీపీ ప్రేరేపిత ఉగ్రవాదమే

 రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని
 కార్యాలయంలో దీక్ష   
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 21: రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులన్నీ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమేనని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకు మద్దతుగా స్థానిక తిలక్‌రోడ్డులోని టీడీపీ కార్యాలయం వద్ద గురువారం ఎమ్మెల్యే భవాని, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ నేత కాశి నవీన్‌కుమార్‌, టీఎన్‌టీయూిసీ జిల్లా అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు, పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్‌, మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి దీక్ష చేశారు.  ఎమ్మెల్యే భవాని మాట్లాడుతూ తమ పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్ల పైదాడి వెనుక కుట్ర దాగి ఉందన్నారు. మాదక ద్రవ్యాలకు కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేసిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. తమ పార్టీ నాయకుడు పట్టాభి ఇంటిపై దాడిచేసిన వారిని అరెస్టు చేయకపోగా ఆయన్నే అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ప్రశ్నిస్తే సమాధానం చెప్పే సత్తాలేని వైసీపీ నాయకులు దాడులకు ఎగబడుతున్నారని దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అనంతరం వారు పోలీస్‌ అమర వీరులకు నివాళులర్పించారు. దీక్షలో మహిళా కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తురకల నిర్మల, నగర అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, యిన్నమూరి రాంబాబు, బాబీ, సింహ నాగమణి, నాయకులు జానకీరామయ్య, కుడిపూడి సత్తిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:05:33+05:30 IST