టీడీపీతోనే బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి

ABN , First Publish Date - 2021-10-14T06:32:50+05:30 IST

టీడీపీ హయాంలోనే బడుగు, బలహీనవర్గాలు అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు.

టీడీపీతోనే బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి

రాజోలు, అక్టోబరు 13: టీడీపీ హయాంలోనే బడుగు, బలహీనవర్గాలు అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. బి.సావరంలో శెట్టిబలిజ సంఘ భవనం వద్ద టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు చెల్లు బోయిన మోహన్‌శ్రీనివాస్‌ అధ్యక్షతన బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన   మాట్లాడారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధిని  వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వది లేసిందన్నారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్‌ నిధులను పక్కద్రోవ పట్టించారన్నారు. టీడీపీ హయాంలో ఎస్సీ, బీసీల  జీవ నోపాధి కోసం రూ.లక్షల విలువైన కార్లు, ట్రాక్టర్లు, జేసీబీలు సబ్సిడీపై ఇచ్చి ఆర్థికపరంగా లబ్ధి చేకూరేందుకు చంద్రబాబు కృషి చేశారన్నారు. బి.సావరంలో 50ఏళ్లలో జరగని అభి వృద్ధిని టీడీపీ హయాంలో గ్రామాన్ని అభివృద్ధి చేశామ న్నారు. కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు ఐటీడీపీ అధ్యక్షుడు మానేపల్లి బాలాజీవేమా, బొడ్డపల్లి చిట్టిబాబు, కట్టా సత్యనారాయణమూర్తి, పెచ్చెట్టి వెంకటశ్రీనివాసరావు, కొణతం దొరబాబు తదితరులు  పాల్గొన్నారు. Updated Date - 2021-10-14T06:32:50+05:30 IST