టీడీపీ బంద్‌ విజయవంతం

ABN , First Publish Date - 2021-10-20T05:30:00+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు పిలుపుమేరకు రాష్ట్రబంద్‌లో పాల్గొంటున్న మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావును ముందస్తుగా రాజోలు పోలీసులు బుధవారం గృహ నిర్బంధం చేశారు.

టీడీపీ బంద్‌ విజయవంతం

టీడీపీ అధిష్ఠానం పిలుపు మేరకు అమలాపురం, రామచంద్రపురం డివిజన్లలో  ఆ పార్టీ నాయకు లు, కార్యకర్తలు బుధవారం ఆందోళన చేశారు. దుకాణాలను, ప్రభుత్వ,ప్రైవేట్‌ స్కూళ్లను బంద్‌ చేయించారు.  నాయకులను గృహాలు, పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించారు. 

 గ్రామ గ్రామాన విశేష స్పందన 

 పోలీస్‌స్టేషన్లవద్ద కార్యకర్తల ఆందోళన 

 గృహాలు, పోలీస్‌స్టేషన్లలో ముఖ్యనాయకుల నిర్బంధం

రాజోలు, అక్టోబరు 20:  టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు పిలుపుమేరకు రాష్ట్రబంద్‌లో పాల్గొంటున్న మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావును ముందస్తుగా రాజోలు పోలీసులు బుధవారం గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా మాజీమంత్రి గొల్లపల్లి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా బంద్‌ నిర్వహించుకునే అవకాశం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోందని, వైసీపీ ప్రభుత్వ విధానాలకు పోలీసులు వత్తాసు పలకడం బాధాకరమన్నారు. టీడీపీ పిలుపు మేరకు ఆంధ్రా బంద్‌కు స్పందించి సహకరించిన రాజోలు, తాటి పాక, మలికిపురం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వారికి గొల్లపల్లి కృతజ్ఞతలు తెలిపారు. తాటిపాక, రాజోలులో దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ కార్యక్రమంలో రాజోలు ఎంపీపీ కేతా శ్రీనివాస్‌, రాజోలు మండల టీడీపీ అధ్యక్షుడు గుబ్బల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి చాగంటి స్వామి, కాండ్రేగుల సత్యనా రాయణ, మానేపల్లి బాలాజీవేమా, సర్పంచ్‌ కడలి సత్యనారాయణ, ఎంపీటీసీలు బొడ్డు కృష్ణారావు, శిరిగినీడి వెంకంటేశ్వర రావు, టీడీపీ సీనియర్‌ నాయకుడు మెరుగుమువ్వల సత్యవర ప్రసాద్‌, కాండ్రేగుల కుశులుడు పాల్గొన్నారు. 

ఉప్పలగుప్తం పోలీసుల కస్టడీలో నాయకులు

ఉప్పలగుప్తం: అల్లవరం, అమలాపురం రూరల్‌, ఉప్పలగుప్తం మండలాలతో పాటు అమలాపురం టౌన్‌ పరిధిలో ముఖ్య నాయకులను ఉప్పలగుప్తం పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉప్పలగుప్తం తరలివ చ్చారు. పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళన చేశారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోవడంతో స్టేషన్‌లోనే ఆందోళన కొనసాగించారు. ఉప్పలగుప్తం ఎస్సై జి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు ఎస్సైలు, సిబ్బంది ఆందో ళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. నిర్బంధించిన వారిలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, మహి ళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, మాజీ జడ్పీటీసీ దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల పార్టీ  అధ్యక్షులు అరిగెల నానాజీ, దెందుకూరి సత్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శి కొల్లు శ్యామ్‌సుందర్‌, సర్పంచ్‌ నల్లా బాబండి, భాస్కరరావు ఉన్నారు.

అధిష్టానం ఆదేశాల మేరకు మండలంలో బుధవారం బంద్‌ను తెలుగుదేశం కార్యకర్తలు విజయవంతం చేశారు. గ్రామాగ్రామాన దుకాణాలు మూసివేసి టీడీపీకి వ్యాపారులు మద్దతు తెలిపారు. ముఖ్య నాయకులు అరి గెల  నానాజీ, దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ, రవణం మధు, నిమ్మకాయల సూర్యనారాయణమూర్తి, పోలిశెట్టి భాస్కరరావులను గృహనిర్బంధం చేశారు. ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు స్టేషన్‌ వద్ద కార్యకర్తలు ఆందోళన చేశారు. పార్టీ అధ్యక్షు డు అరిగెల నానాజీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కొల్లు శ్యామ్‌సుందర్‌, చిక్కం ఉమేష్‌, మద్దింశెటి ్టసురేష్‌, సలాది శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ నాయకుల నిరసన

పి.గన్నవరం: టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై దౌర్జన్యకాండకు పాల్పడిన వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. తొలుత బంద్‌కు సహకరించాలని వర్తకులను టీడీపీ నాయకులు కోరుతున్న సమయంలో ఎస్‌ఐ జి.సురేంద్ర అక్కడకు చేరుకుని బంద్‌లు, నిరసనలు నిర్వహించడానికి అనుమతులు లేవని, ఈక్రమంలో నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులను పోలీసుజీపు, ఆటో లు సహాయంతో 20 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి అనంతరం విడుదల చేశారు. అలాగే టీడీపీ నాయకులు డొక్కా నాధుబాబు, ఎంపీపీ అంబటి భూలక్ష్మీ, సంసాని పెద్దిరాజు, పడాల వెంకటేశ్వరరావు, అంబటి కొటేశ్వరరావులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తొలేటి సత్తిబాబు, మట్టపర్తి రామకృష్ణ, శేరు శ్రీనుబాబు, గోగి రమేష్‌, ఈశ్వరరావు, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

మలికిపురం: తెలుగుదేశంపార్టీ కార్యాలయంపై, నా యకులపై దాడులకు నిరసనగా మలికిపురం లో టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. వ్యాపార సంస్థలు, వాణి జ్య బ్యాంకులను బంద్‌ చేయిం చారు. మోటారు సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా ప్ర ధాన కార్యదర్శి మంగెన భూదేవి మా ట్లాడారు. టా కార్య క్రమాలలో సఖినేటిపల్లి మండలం తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ముప్పర్తి నాని, సర్పంచ్‌లు చెల్లుబో యిన హెలీ న, యెనుముల నాగు, అడబాల యుగంధర్‌ పాల్గొన్నారు. 

అంబాజీపేట: అంబాజీపేటలో టీడీపీ బంద్‌ ప్రశాంతంగా జరిగింది. టీడీపీ నాయకులు పాఠశాలలు, బ్యాం క్‌లు, అధికార కార్యాలయాలను మూయించి వేశారు. అంబాజీపేట సెంటర్‌లో టీడీపీ నాయకులు నిరసన చేపట్టే సమయంలో అంబాజీపేట ఎస్‌ఐ ఎ.చైతన్యకుమార్‌ అరెస్ట్‌ చేశారు. టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు దంతులూరి శ్రీనురాజు, కార్యదర్శి గుడాల ఫణి, సర్పం చ్‌ జల్లి బాలరాజు, ఎంపీటీసీ పబ్బినీడి రాంబాబు, నాయకులు పాల్గొన్నారు. 

కాట్రేనికోన: టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగిడి నాగేశ్వరరావు, మండల అఽధ్యక్షుడు నడింపల్లి సుబ్బరాజు ఆధ్వర్యంలో బుధవారం మండలంలో బంద్‌ విజయవంతమైంది. దేశం నాయకులు, కార్యకర్తలు చెయ్యేరు నుంచి పల్లంకుర్రు వరకు మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. వ్యాపార సంస్థలు, బ్యాంకులు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. కార్యక్రమంలో వెంట్రు సుధీర్‌, సూదా బాబూరావు, జనిపెల్ల సోమన్న, విత్తనాల బుజ్జి, కోటిపల్లి సత్యనారాయణ, విత్తనాల వెంకటరమణ పాల్గొన్నారు.

ముమ్మిడివరం:  టీడీపీ ఆధ్వర్యంలో బంద్‌ను చేపట్టారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కాశివాని తూముసెంటర్‌ నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, వర్తక వ్యాపార సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలను మూయించివేశారు. కాశివానితూముసెంటర్‌లో 216 జాతీయ రహదారిపై భైఠాయించి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు.  నిరసన వ్యక్తంచేస్తున్న టీడీపీ నాయకులను సీఐ ఎం.జానకీరామ్‌ అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పదిమందిపై కేసులు నమోదు చేసి వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేశారు. కార్యక్రమంలో గొలకోటి దొరబాబు, చెల్లి అశోక్‌, దొమ్మేటి రమణకుమార్‌, పొద్దోకు నారాయణరావు, పొత్తూరి విజయభాస్కరవర్మ, ఎన్‌.సూర్యప్రభాకరం, దాట్ల బాబు, పాల్గొన్నారు. 

అయినవిల్లి: టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా, సిబ్బందిపైనా వైసీపీ శ్రేణుల దాడిని నిరసిస్తూ కేంద్ర కమిటీ ఇచ్చిన బంద్‌ పిలుపులో భాగంగా అయినవిల్లి మండలంలో టీడీపీ నాయకులను బుధవారం గృహనిర్భందం చేశారు. టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాస్‌, కార్యదర్శి బుజ్జి, కోశాధికారి ఎస్‌.సత్యనారాయణరాజు, మాజీ ఎంపీపీ సలాది పుల్లయ్యనాయుడు, మద్దాల సుబ్బారావు, సలాది  బాబూరావు, హెచ్‌ఆర్‌డీ సభ్యుడు నేదునూరి వీర్రాజును పోలీసులు గృహనిర్బంధం చేశారు. 

టీడీపీ కార్యాలయంపై దాడి అమానుషం

మామిడికుదురు: మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడి చేయడం అమానుష చర్య అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నామన రాంబాబు విమర్శించారు. పార్టీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ మండలంలో బుధవారం బంద్‌ నిర్వహించి వ్యాపార సముదాయాలు, బ్యాంకులు, పాఠశాలలను మూయించివేశారు. కార్యక్రమంలో పార్టీ మండలశాఖ అధ్యక్షుడు మొల్లేటి శ్రీనివాస్‌, సూదా బాబ్జి, సర్పంచ్‌ ఎస్‌.రాజేష్‌కుమార్‌ పాల్గొన్నారు. 

అల్లవరం: మండలపార్టీ అధ్యక్షుడు  దెందుకూరి సత్తిబాబురాజు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ అరా చక పాలనకు వ్యతిరేకంగా నినాదాలతో ధర్నా చేశారు. నడింపల్లి  సుబ్రహ్మణ్యంరాజు, వేగిరాజు వెంకట్రాజు, పోతుల నరసింహారావు, అల్లూరి సత్తిబాబురాజు, చింతా శ్రీనివాస్‌, కొపనాతి తాతాజీ, కేవీ, యాళ్ల కాసుబాబు, కాకిలేటి సూరిబాబు, గెద్దాడ శ్రీనివాస్‌, యాళ్ల ఈశ్వరరావు, పరసా కిరణ్‌, కడలి విజయ్‌, ఎంపీటీసీలు ఎం.శ్రీనివాస్‌, ఎం రాంబాబులు ఆందోళనలో పాల్గొన్నారు.

తాళ్లరేవు:  తాళ్లరేవు టీడీపీ మండలపార్టీ కార్యదిర్శి వాడ్రేవు వీరబాబు ఆధ్వర్యంలో పలువురు దేశం నాయకులు బుధవారం ధర్నా చేశారు. ముందుగా గుడ్డివానితూము సెంటరు నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ప్రభుత్వ వ్యతిరేక విదానాలతో నాయకులు ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకులు మందాల గంగసూర్యనారాయణ, ధూళిపూడి వెంకటరమణ, కట్టా త్రిమూర్తులు, జక్కల ప్రసాద్‌బాబు, వాసంశెట్టి శ్రీనివాసరావు, పాల్గొన్నారు. 

టీడీపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికం

కొత్తపేట: బంద్‌ను అడ్డుకోవడానికి పోలీసులు తమ పార్టీ నేతలను అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం అప్రజాస్వామికమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విమర్శించారు. కార్యకర్తలు మోటారు సైకిళ్లపై ర్యాలీ నిర్వహించి పాతబస్టాండ్‌ సెంటర్లో నిరసన తెలిపారు. దుకాణాలు, పాఠశాలలను స్వచ్ఛందంగా మూసివేశారు. 

అంతర్వేది: సఖినేటిపల్లి మండలంలో టీడీపీ నాయకులు బుధవారం ధర్నా, నిరసన నిర్వ హించారు. మండల కార్యదర్శి తాడి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళగిరిలోని పార్టీ కార్యాల యాన్ని ధ్వంసం చేయడంపై మండలాధ్యక్షుడు ముప్పర్తి నాని, టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. సఖినేటిపల్లి సెంటర్‌ పలువురు టీడీపీ నాయకులు నిరసన వ్యక్తంచేసి ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇటువంటి దిగజారుడు చర్యలు చేపడితే భవిష్యత్తులో ఎదురు దెబ్బ తింటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

ఐ.పోలవరం:  మండలవ్యాప్తంగా టీడీపీ నాయకులు ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలతోపాటు బ్యాంకులను, విద్యాసంస్థలను మూసివేయించి బంద్‌ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, చెల్లి వివేకానంద, జడ్పీటీసీ పేరాబత్తుల రాజశేఖర్‌తోపాటు నాయకులు చెయ్యేటి శ్రీనుబాబు, గంజా సుధాకర్‌, జంపన బాబు, తదితరులు పాల్గొన్నారు. 

ద్రాక్షారామ: స్థానిక మెయిన్‌డ్డులో టీడీపీ నాయకులు మోటారు సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు. యానాం సెంటర్లోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ చింతపల్లి వీరభద్రరావు, టీడీపీ మండల అధ్యక్షుడు పెంకె సాంబశివరావు, ఉపాధ్యక్షుడు చుండ్రు సాయిరామ్‌, నాయకులు కొత్తపల్లి శ్రీను, సూదంశెట్టి గంగాధర వెంకటరమణ, యల్లమిల్లి సత్తిబాబు, యండగండి ఎంపీటీసీ కుమారి పాల్గొన్నారు.

కె.గంగవరం: టీడీపీ నాయకులు సత్యవాడ, గంగవరం తదితర గ్రామాల్లో పాఠశాలలు, ప్రభు త్వ కార్యాలయాలు, వాణిజ్య బ్యాంకులు, దుకాణాల సముదాయాలను మూ యించి వేశారు. గంగవరం బస్టాండు సెంటర్లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడు చొల్లంగి ఎదుర్లయ్య, నాయకులు కొత్తపల్లి మొరార్జీ, కడలి సత్యసూర్యకుమారి, కడలి వెంకట రమణ, చిట్టూరి సుబ్బారావు పాల్గొన్నారు. 

ఆత్రేయపురం: మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు ఆత్రేయపురం సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలను మూయించివేశారు. అధికార పార్టీ ఆగడాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు, ముళ్లపూడి భాస్కరరావు, కరుటూరి నరసింహారావు, పాళింగి రవిచంద్ర, తోట రజని, గార్లపాటి గోపి, మద్దింశెట్టి సత్యనారాయణ, చిటికెన సత్యనారాయణ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. 

రావులపాలెం రూరల్‌: టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బం డారు సత్యానందరావు ఆదేశాల మేరకు తెలుగు యువత అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షుడు చిలువూరి సతీష్‌రాజు, టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు గుత్తుల పట్టాభిరామారావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై సీఎం జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇరు ప్రాంతాల్లో ఉన్న కాసురెడ్డి, రాకేష్‌వర్మ, సింహా, జక్కంపూడి వెంకటస్వామి, భాగ్యారావు, కేతా శ్రీను, వెంకటేశ్వరరావు, బాబిలతో పాటు పలువురు నాయకులను సీఐ వి.కృష్ణ ఆధ్వర్యంలో అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. 

వైసీపీ నిరంకుశ పాలన సాగిస్తోంది: బండారు

 వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి నిరంకుశ పాలన సాగిస్తోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో నిరసన తెలుపుతున్న తమ పార్టీ నాయకులను దౌర్జన్యంగా అరెస్టు చేయడం అన్యాయమన్నారు.

‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా’

మండపేట: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేక బిహార్‌ తరహా పాలన సాగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆదేశాల మేరకు మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ చుండ్రు శ్రీవరప్రకాష్‌ నేతృత్వంలో నియోజకవర్గం నలమూలల నుంచి తరలివచ్చిన టీడీపీ శ్రేణులు నిరసన నిరసన ప్రదర్శన చేపట్టాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ నల్లమిల్లి వీర్రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు, మండల అధ్యక్షుడు యరగతపు బాబ్జీ, ముత్యాలవెంకట్రావు, కొప్పిశెట్టి మాధవరావు, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రిమ్మలపూడి వేణుగోపాలదొర, అమలాపురం పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు వైఆర్కే పరమహంస, కౌన్సిలర్లు కాశిన కాశీ, యరమాటి గంగరాజు, చుండ్రు సుబ్బారావు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాయవరం స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే నిర్బంధం

రాయవరం: అనపర్తి మండలం రామవరంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని రాయవరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కొన్ని గంటల పాటు స్టేషన్‌లో ఉంచి వదిలిపెట్టారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై వైసీపీ గూండాల దాడులు ప్రభుత్వ ప్రేరేపిత కుట్రగా పేర్కొన్నారు. దాడులు జరిగిన రోజు ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అన్నారు. 

ప్రభుత్వ ప్రోద్భలంతోనే టీడీపీ నేతలపై దాడులు

టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉ న్న పలు కార్యాలయాలు, నేత పట్టాభి ఇంటిపై దాడి ప్ర భుత్వ ప్రోద్భలంతోనే జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 

ఆలమూరు: టీడీపీ మండల అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు వంటిపల్లి సతీష్‌కుమార్‌, కడియాల శ్రీనివాస్‌, ఈదల రాంబాబు, సలాది నాగేశ్వరరావు, కొమ్ము నారాయుడు, కేతా రాంబాబు, వైట్ల శేషుబాబు, సీహెచ్‌ గణేష్‌, దండంగి రామారావు, మానేపల్లి శ్రీనివాస్‌ బ్యాంకులు, స్కూల్లు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలను బంద్‌ చేయించారు.

కాజులూరు: మండల గ్రామాల్లో టీడీపీ ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. గొల్లపాలెంలో దుకాణాలను మూ యించి వేశారు. కాజులూరు వెళ్లే కూడలిలో నిరసన తెలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు సలాది సాయిబాబా, నాయకులు రాయుడు లీలాశంకర్‌, కోట తాతబ్బాయి, పలివెల ఇజ్రాయిల్‌, పెంకే సూర్యనారాయణ పాల్గొన్నారు.

రామచంద్రపురం: పట్టణంలోని టీడీపీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా మెయిన్‌రోడ్డులో ని అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకుని వినతిపత్రం అందజేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు కడియాల రాఘ వన్‌ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో చింతపల్లి వీరభద్రరా వు, జొన్నకూటి భాస్కరరావు, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మేడిశెట్టి సూర్యనారాయణ, టీడీపీ ప్రధాన కార్యదర్శి నండూరి ఫణికుమార్‌, ప్రచార కార్యదర్శి కొసనా శ్రీని వాస్‌, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జాస్తి విజ యలక్ష్మి, కౌన్సిలర్‌ సత్తిబాబు, విజయరాజు, పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T05:30:00+05:30 IST