క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం

ABN , First Publish Date - 2021-10-14T05:31:50+05:30 IST

తుని, అక్టోబరు 13: క్రీడలతో మానసిక ఒత్తిడిని దూరం చేయవచ్చని తాండవ షుగర్స్‌ మాజీ చైర్మన్‌, టీడీపీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సుర్ల లోవరాజు అన్నారు. విజయదశమి సంధర్భంగా వి. కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను బుధవారం ఆ

క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం

తాండవ షుగర్స్‌ మాజీ చైర్మన్‌ సుర్ల లోవరాజు

తుని, అక్టోబరు 13: క్రీడలతో మానసిక ఒత్తిడిని దూరం చేయవచ్చని తాండవ షుగర్స్‌ మాజీ చైర్మన్‌, టీడీపీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సుర్ల లోవరాజు అన్నారు. విజయదశమి సంధర్భంగా వి. కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ యువత క్రీడలపై శ్రద్ధ చూపించాలన్నారు. చదువుతో పాటు ఆటలు ఆడడం వల్ల మానసిక స్థైర్యాన్ని పెంపొందవచ్చన్నారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమం లో వి.కొత్తూరు మాజీ వైస్‌ సర్పంచ్‌ బోజంకి అప్పారావు, రాయవరపు నాగేం ద్ర, తమరాన సత్తిబాబు, తమరాన రామకృష్ణ, కిల్లి శ్రీను, సప్ప బుజ్జి, కర్రి ఏడుకొండలు, బోజంకి బుల్లోడు, బోజంకి నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-14T05:31:50+05:30 IST