స్విమ్మింగ్‌లో శ్యామల రికార్డు
ABN , First Publish Date - 2021-03-22T04:55:04+05:30 IST
సామర్లకోట, మార్చి 21: పాక్ జలసంధిని 13 గంటల 43 నిమిషాల పాటు ఏకబిగిన ఈదిన ప్రపంచంలో రెండో మహిళగా రికార్డు సాధించిన గోలి శ్యామల సామర్లకోటకు చెం దిన వారు కావడం విశేషం. పట్ణణంలోని మఠం సెంటర్ ప్రాంతానికి చెందిన సివిల్ ఇంజనీర్ గోలి మోహన్‌తో శ్యామ

సామర్లకోట, మార్చి 21: పాక్ జలసంధిని 13 గంటల 43 నిమిషాల పాటు ఏకబిగిన ఈదిన ప్రపంచంలో రెండో మహిళగా రికార్డు సాధించిన గోలి శ్యామల సామర్లకోటకు చెం దిన వారు కావడం విశేషం. పట్ణణంలోని మఠం సెంటర్ ప్రాంతానికి చెందిన సివిల్ ఇంజనీర్ గోలి మోహన్‌తో శ్యామల వివాహా మైంది. యానిమేషన్ చిత్రాలకు నిర్మాత, దర్శకురాలు, రచయితగా ఆమె పనిచేసి హైద్రాబాద్‌లో నివాసం ఏర్పరచుకున్నారు. 47 ఏళ్ల శ్యామల నాలుగు సంవత్సరాల్లో స్విమ్మింగ్‌లో మంచిపట్టు సాధించి గతేడాది దక్షిణ కొరియాలో జరిగిన ఫినా వరల్డ్ మాస్టర్స్ చాంపియన్‌షిప్ పోటీలకు భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు. గతేడాది నవంబర్‌లో గంగానదిలో 30 కి.మీ దూరాన్ని కేవలం 110 నిమిషాల్లో ఈది రికార్డు నెలకొల్పారు. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం ఉదయం 4.15 నిమిషాలకు శ్రీలంక తీరంలో సాహసాన్ని ప్రారంభించి 13 గంటల 43 నిమిషాల పాటు ఏకబిగిన ఈది రామేశ్వరంలోని ధనుష్కోడి తీరం చేరారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తొలి తెలుగు మహిళగానే గాక ప్రపంచంలో రెండోమహిళగా సరికొత్త రికార్డు నెలకొల్పారు.