స్వీట్‌స్టాల్‌ వ్యాపారి మృతి

ABN , First Publish Date - 2021-05-08T06:31:02+05:30 IST

స్వీట్‌ స్టాల్‌ వ్యాపారి శ్రీను(48) శుక్రవారం కొవిడ్‌తో చికిత్స పొందుతూ మృతి చెందారు.

స్వీట్‌స్టాల్‌ వ్యాపారి మృతి

అంబాజీపేట, మే 7: స్వీట్‌ స్టాల్‌ వ్యాపారి శ్రీను(48) శుక్రవారం కొవిడ్‌తో చికిత్స పొందుతూ మృతి చెందారు. అందరితో ఆప్యాయంగా ఉంటూ అందరి మన్ననలు పొందిన వ్యక్తిగా శ్రీను మాచవరం గ్రామస్థులకు సుపరిచితుడు. ఆయన మృతికి స్థానికులు శిరిగినీడి వెంకటేశ్వరరావు, మహిపాల తాతాజీ, అరిగెల సూరిబాబు, అప్పన సురేష్‌బాబు, ఉపసర్పంచ్‌ సుంకర నాయుడు, వల్లూరి దుర్గాప్రసాద్‌, అప్పన శ్రీను, నాగాబత్తుల సుబ్బారావు తదితరులు సంతాపం తెలిపారు. అలాగే అంబాజీపేటకు చెందిన కొబ్బరి వ్యాపారి బొడ్డు ఆదినారాయణ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతికి కోనసీమ కోప్రామర్చంట్‌ అసోసియేషన్‌ సంతాపం తెలిపింది.  Updated Date - 2021-05-08T06:31:02+05:30 IST