స్వచ్ఛత కోసం పోరాటం చేస్తుంటే రోడ్డుమీద చెత్త వేస్తారా: కమిషనర్‌

ABN , First Publish Date - 2021-08-27T06:16:19+05:30 IST

నగరంలో స్వచ్ఛత కోసం పోరాటం చేస్తుంటే రోడ్డుమీద చెత్త వేస్తారా అని నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ మండిపడ్డారు

స్వచ్ఛత కోసం పోరాటం చేస్తుంటే  రోడ్డుమీద చెత్త వేస్తారా: కమిషనర్‌

కార్పొరేషన్‌(కాకినాడ), ఆగస్టు 26: నగరంలో స్వచ్ఛత కోసం పోరాటం చేస్తుంటే రోడ్డుమీద చెత్త వేస్తారా అని నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ మండిపడ్డారు. కార్పొరేషన్‌ 12వ సర్కిల్‌లోని రామారావుపేట, గాంధీనగర్‌ ప్రాంతాల్లో గురువారం పర్యటించారు. ఈ ప్రాంతాల్లోని ప్రధాన కూడలిలో షాపులవద్ద రాత్రి సమయంలో చెత్తను రోడ్లపై వేస్తున్న విషయాన్ని గుర్తించి యజమానులకు భారీ జరిమానా విధించారు. విస్తృత అవగాహక కల్పించినా ఇంకా చాలామంది రోడ్లపైన, డ్రైనేజీల్లో చెత్తను వేస్తున్నారని, ఇటువంటి వారికి అవగాహన కల్పించడంతోపాటు భారీ జరిమానా విధించాలని సిబ్బంది ఆదేశించారు. నగర ప్రజలు తడి, పొడి చెత్త వేరుగా ఇవ్వడం ద్వారా డంపింగ్‌ సమస్యను పారదోలారన్నారు. షాపు యజమానులందరూ వారి షాపుల ముందు చెత్త బుట్టలు తప్పనిసరిగా ఉంచాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  కమిషనర్‌తోపాటు ట్రైనీ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, హెల్తాఫీసర్‌ ఫృధ్వీచరణ్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లు లాజర్‌, రాంబాబు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-27T06:16:19+05:30 IST