సర్క్యులర్‌ 172ను ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2021-07-05T06:34:53+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అమ లు చేయనున్న నూతన విద్యా విధానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన సర్క్యులర్‌ నంబరు 172తో బడుగు బలహీనవర్గాలు, దళిత విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు.

సర్క్యులర్‌ 172ను   ఉపసంహరించుకోవాలి

అమలాపురం టౌన్‌, జూలై 4: కేంద్ర ప్రభుత్వం అమ లు చేయనున్న నూతన విద్యా విధానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన సర్క్యులర్‌ నంబరు 172తో బడుగు బలహీనవర్గాలు, దళిత విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. అమలాపురం త్రిరత్న బుద్ధవిహార్‌లో ఆదివారం కేవీపీఎస్‌ జిల్లాశాఖ గౌరవాధ్యక్షుడు మోర్త రాజశేఖర్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించగా జిల్లా కన్వీనర్‌ పచ్చి మాల వసంతకుమార్‌ ప్రారంభించారు. నూతన విద్యా విధానం- 2020-విద్యార్థులపై ప్రభావం అనే అంశంపై చర్చించారు. యూటీఎఫ్‌ నాయకులు జీవీ రమణ, కుడు పూడి శ్రీనివాస్‌ మాట్లాడారు.  సర్క్యు లర్‌ 172ను విర మించుకోకపోతే ఉద్యమిస్తామని వ్యవసాయ కార్మిక సం ఘం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు, పీడీఎస్‌ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావులు హెచ్చరిం చారు. ప్రజాసంఘాల నాయకులు గోసంగి ఆనందరావు, టి.నాగవరలక్ష్మి, జి.దైవకృప, హరీష్‌  పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-05T06:34:53+05:30 IST