కొడుకు మాట్లాడలేదని గోదావరిలో దూకిన వృద్ధుడు

ABN , First Publish Date - 2021-10-07T05:57:08+05:30 IST

కన్న కొడుకు మాట్లాడడం లేదని మనస్తాపంతో ఒక వృద్ధుడు గోదావరిలోకి దూకేశాడు.

కొడుకు మాట్లాడలేదని గోదావరిలో దూకిన వృద్ధుడు

రక్షించిన ఇసుక ర్యాంపు కూలీలు

పి.గన్నవరం, అక్టోబరు 6: కన్న కొడుకు మాట్లాడడం లేదని మనస్తాపంతో ఒక వృద్ధుడు గోదావరిలోకి దూకేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన మురాల చిన్నయ్య (73) తన కుమార్డు మాట్లాడటం లేదని మనస్తాపంతో బుధవారం మధ్యాహ్నం సమయంలో పాత అక్విడెక్టు మధ్య నుంచి గోదావరిలోకి దూకేశాడు. సమీపంలో ఉన్న ఇసుక ర్యాంపు కూలీలు చికిలే ఏసు, చంటి, సతీష్‌ నీటిలో కొట్టుకుపోతున్న చిన్నయ్యను చూసి ఇసుక బోటు సహాయంతో రక్షించి ఒడ్డుకు చేర్చారు. కాగా ఎడ్ల బండినడుపూకుంటు జీవించే చిన్నయ్యకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారంతా ఉపాధి నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లారు. ఇక్కడే ఉన్న ఒక కొడుకు అశోక్‌ మూడు రోజలుగా మాట్లాడడం లేదన్న మనస్తాపంతో తెల్ల్లవారుజామున  బయటకు వచ్చేశానని చిన్నయ్య తెలిపాడు.  పోలీసులు చిన్నయ్యను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్‌ ఇచ్చిన అనంతరం కుమారుడు అశోక్‌కు అప్పగించారు.Updated Date - 2021-10-07T05:57:08+05:30 IST