సబ్‌ప్లాన్‌ నిధులను తక్షణం విడుదల చేయాలి

ABN , First Publish Date - 2021-08-10T06:22:20+05:30 IST

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధు లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని డిమాండు చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా పార్లమెంటు జిల్లాశాఖ అధ్యక్షుడు పలివెల రాజు ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు.

సబ్‌ప్లాన్‌ నిధులను తక్షణం విడుదల చేయాలి

అమలాపురం టౌన్‌, ఆగస్టు 9: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధు లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని డిమాండు చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా పార్లమెంటు జిల్లాశాఖ అధ్యక్షుడు పలివెల రాజు ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్‌ నుంచి ర్యాలీని బీజేపీ పార్లమెంటు జిల్లాశాఖ అధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీ వేమా ప్రారంభించారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అక్కడ ధర్నా చేపట్టారు. ఆర్డీవోకు వినతిపత్రాన్ని అందజేశారు. ఆయాకార్యక్రమాల్లో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆకుమర్తి బేబిరాణి, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జి దూరి రాజేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు మోకా వెంకటసుబ్బా రావు, అడబాల సత్యనారాయణ, యిళ్ల వెంకటేశ్వరరావు, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు  విళ్ల దొర బాబు, స్వచ్ఛ భారత్‌ రాష్ట్ర కన్వీనర్‌ పాలూరి సత్యానందం, డాక్టర్‌ పెయ్యల శ్యాంప్రసాద్‌, జంగా రాజేంద్రకుమార్‌, కొల్లి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-10T06:22:20+05:30 IST