విద్యార్థులందరికీ ప్రయోజనం చేకూర్చాలి
ABN , First Publish Date - 2021-10-29T05:43:24+05:30 IST
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలు సీఎం జగన్ ఆలోచనలను ఆచరణలోనికి తెచ్చి విద్యార్థులందరికీ ప్రయోజనం చేకూర్చాలని ఉపకులపతి మొక్కా జగన్నాథరావు కోరారు.

దివాన్‌చెరువు, అక్టోబరు 28: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలు సీఎం జగన్ ఆలోచనలను ఆచరణలోనికి తెచ్చి విద్యార్థులందరికీ ప్రయోజనం చేకూర్చాలని ఉపకులపతి మొక్కా జగన్నాథరావు కోరారు. ఆయన ను అనుబంధ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నాయకులు గురువా రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఉన్నత విద్యపై సీఎం రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించి పలు కీలక అంశాలను తెలిపారని వీసీ అన్నారు. అసోసియే ుషన్ నాయకులు మాట్లాడుతూ ఉన్నత విద్య అభివృద్ధికి పూర్తి సహాయ సహ కారాలు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీకే విశ్వేశ్వరరెడ్డి, నరసిం హారావు, రమణరావు, బ్రహ్మాజీ, తోట వాసు తదితరులున్నారు.