విద్యార్థినికి రూ.50 వేల ఆర్థిక సహాయం
ABN , First Publish Date - 2021-12-31T05:45:42+05:30 IST
తాటిపాక వేద కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కొల్లు సింధు బోన్ క్యాన్సర్‌తో బాధపడుతోంది.

రాజోలు, డిసెంబరు 30: తాటిపాక వేద కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కొల్లు సింధు బోన్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. గురువారం కళాశాలకు వచ్చిన మేఘాలయ రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పి.సంపత్‌కుమార్ వేద విద్యా సంస్థల తరపున బాధితురాలి బంధువులకు రూ.50వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో వేద విద్యా సంస్థల కార్యదర్శి రవికుమార్, అకడమిక్ డైరెక్టర్ కంచి సూర్యనారాయణ, ప్రిన్సిపాల్ సోమేశ్వరరావు, ఏవో రామరాజు, వైస్ ప్రిన్సిపాల్ బాపన్న, సిబ్బంది పాల్గొన్నారు.