సమర్థవంతంగా పనిచేయాలి: ‘నన్నయ’ వీసీ

ABN , First Publish Date - 2021-08-20T05:56:33+05:30 IST

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సిబ్బంది సమర్థవంతంగా పనిచేసి వర్శిటీ అభివృద్ధికి కృషి చేయాలని వీసీ మొక్కా జగన్నాథరావు అన్నారు.

సమర్థవంతంగా పనిచేయాలి: ‘నన్నయ’ వీసీ

దివాన్‌చెరువు, ఆగస్టు 19: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సిబ్బంది సమర్థవంతంగా పనిచేసి వర్శిటీ అభివృద్ధికి కృషి చేయాలని వీసీ మొక్కా జగన్నాథరావు అన్నారు. యూనివర్శిటీ కన్వెన్షన్‌ సెంటర్‌లో గురువారం వర్శిటీ అధికారులు, అధ్యాపకేతర సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని 430 అనుబంధ కళాశాలతో నన్నయ వర్శిటీ ఎక్కువ బాధ్యతలను నిర్వహిస్తున్నందున సిబ్బంది అత్యంత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని వీసీ స్పష్టం చేశారు. వర్శిటీ ప్రతిష్టను పెంచేలా పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-20T05:56:33+05:30 IST