సమర్థవంతమైన సేవలందించాలి

ABN , First Publish Date - 2021-08-20T05:55:31+05:30 IST

గ్రామస్థాయిలో సేవలందించే అన్ని ప్రభుత్వ శాఖలను సమ్మిళితం చేసుకుని పౌరులకు సమర్థవంతమైన సేవలందించాలని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా సూచించారు.

సమర్థవంతమైన సేవలందించాలి

సీతానగరం, ఆగస్టు 19: గ్రామస్థాయిలో సేవలందించే అన్ని ప్రభుత్వ శాఖలను సమ్మిళితం చేసుకుని పౌరులకు సమర్థవంతమైన సేవలందించాలని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా సూచించారు. గురువారం ఆమె సీతానగరం మండలంలో పర్యటించి ఇసుక ర్యాంపులు, ప్రభుత్వ లేఅవుట్‌లను పరిశీలించారు. అనంతరం సచివాలయాలను సందర్శించి పనుతీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇసుక సరఫరా నిబంధనలకు అనుగుణంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ లేఅవుట్‌లలో అన్ని రకాల మౌలిక సదుపాయాలను సమకూర్చాలని చెప్పారు. గ్రామ వలంటీర్ల వ్యవస్థను సమీకృతం చేస్తూ స్థానికంగా గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పడిందని సబ్‌కలెక్టర్‌ చెప్పారు. ప్రజలకు సత్వరమే మర్యాదపూర్వక సేవలందించి వారి మన్ననలు పొందాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఫలాలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ పవన్‌కుమార్‌, ఆర్‌ఐ గంగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-20T05:55:31+05:30 IST