రాష్ట్రస్థాయి వక్తృత్వ పోటీలకు తరుణ్‌దేవి
ABN , First Publish Date - 2021-10-30T04:54:25+05:30 IST
మండలంలోని బొబ్బిల్లంక జిల్లా పరిషత్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థిని రేలంగి తరుణ్‌దేవి రాష్ట్రస్థాయి వక్తృత్వ పోటీలకు ఎంపికైనట్టు హెచ్‌ఎం కోలా సత్యనారాయణ శుక్రవారం తెలిపారు.

సీతానగరం, అక్టోబరు 29: మండలంలోని బొబ్బిల్లంక జిల్లా పరిషత్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థిని రేలంగి తరుణ్‌దేవి రాష్ట్రస్థాయి వక్తృత్వ పోటీలకు ఎంపికైనట్టు హెచ్‌ఎం కోలా సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఈ నెల 27న కాకినాడ గాంధీనగర్ పార్కు వద్ద మహాత్మాగాంధీ మున్సిపల్ హైస్కూల్‌లో జరిగిన గర్భధారణ, లింగ నిర్ధారణ పరీక్ష నిషేధ చట్టంపై జిల్లా స్థాయి వక్తృత్వ పోటీలో తరుణ్‌దేవి పాల్గొని మొదటి స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్టు చెప్పారు. నవంబర్ మొదటివారం విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో మన జిల్లా తరపున తరుణ్ దేవి పాల్గొనను న్నట్టు హెచ్‌ఎం సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని తరణ్‌దేవిని, ఆమెకు శిక్షణ ఇచ్చిన సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు ఉల్లి రామకృష్ణను ఎంఈవో కె.స్వామినాయక్, వైసీపీ నాయకులు మల్లినచౌదరి, సర్పంచ్ మెల్లిమి రామచంద్రరావు, ఉపసర్పంచ్ కె.వీరబాబు, ఎంపీటీసీ చిన్ని తదితరులు అభినందించారు.