నారియళ్‌ భారత్‌ న్యూట్రా కంపెనీతో శ్రీలంక బృందం సమావేశం

ABN , First Publish Date - 2021-11-08T06:01:00+05:30 IST

మామిడికుదురులోని నారి యళ్‌ భారత్‌ న్యూట్రా ప్రొడ్యూసర్‌ కంపెనీ సభ్యులతో శ్రీలంకకు చెందిన వ్యాపార బృందం ఆదివారం సమావేశమయ్యారు.

నారియళ్‌ భారత్‌ న్యూట్రా కంపెనీతో  శ్రీలంక బృందం సమావేశం

మామిడికుదురు, నవంబరు 7: మామిడికుదురులోని నారి యళ్‌ భారత్‌ న్యూట్రా ప్రొడ్యూసర్‌ కంపెనీ సభ్యులతో శ్రీలంకకు చెందిన వ్యాపార బృందం ఆదివారం సమావేశమయ్యారు. కొబ్బరి ఉప ఉత్పత్తులు ఎగుమతికి  సంబంధించి శ్రీలంక బృం దం దిల్లాన్‌ఖాన్‌ ఆధ్వర్యంలో ఆదివారం కంపెనీ ప్రతినిధులతో సమావేశమై ఎగుమతుల గురించి చర్చించారు. ఈప్రాంతంలో ఉత్పిత్తి అయ్యే కొబ్బరి ఉపఉత్పత్తుల గురించి అడిగి తెలుసు కున్నారు. కార్యక్రమంలో త్వరలోనే కొబ్బరి నుంచి వచ్చే ఉప ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని కంపెనీ సభ్యులు ఈసంద ర్భంగా తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ సీఎండీ నయినాల వేణుగోపాల్‌, యెరుబండి లక్ష్మయ్య, కొమ్ముల నారాయణమూర్తి, గుండాబత్తుల సత్యనారాయణమూర్తి, గెడ్డం మేరీరత్నం, ఉపాఽ ద్యాయుడు రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-11-08T06:01:00+05:30 IST