క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2021-12-30T05:30:00+05:30 IST

క్రీడాకారులను ప్రోత్సహించేం దుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ పేర్కొన్నారు.

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి

 రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌

అమలాపురం రూరల్‌, డిసెంబరు 30: క్రీడాకారులను ప్రోత్సహించేం దుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక వికాసానికి క్రీడలు దోహద పడతాయన్నారు. పేరూరు జిల్లాపరిషత్‌ ఉన్నత  పాఠశాల క్రీడా ప్రాంగణంలో గురువారం సీఎం కప్‌ క్రీడా పోటీలను ఆయ న ప్రారంభించారు. 18 నుంచి 35లోపు ఉన్న యువకులకు వాలీబాల్‌, కబడ్డీ పోటీలు నిర్వహించగా ఆయన ప్రారంభించారు. అమలాపురం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌ పోటీలను మండల స్థాయిలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి, సెంట్రల్‌బోర్డు చైర్మన్‌ కుడుపూడి వెంక టేశ్వర, జడ్పీటీసీ పందిరి శ్రీహరి, సర్పంచ్‌ దాసరి అరుణ, బొంతు గోవిందు, దాసరి డేవిడ్‌, ఎంపీడీవో ఎం.ప్రభాకరరావు, ఎంఈవో కె.కిరణ్‌బాబు, పీఈటీల అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉండ్రు ముసలయ్య, ఫిజికల్‌ డైరెక్టర్లు డి.గౌరీశంకర్‌, వై.సంజీవయ్య, కె.గణేశ్వ రరావు, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.



Updated Date - 2021-12-30T05:30:00+05:30 IST