జిల్లా ఎస్పీగా రవీంద్రనాథ్‌బాబు
ABN , First Publish Date - 2021-07-08T07:11:42+05:30 IST
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా ఐపీఎస్ అధికారి ఎం.రవీంద్రనాధ్‌బాబును నియమి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

గ్రేహౌండ్స్ కమాండెంట్‌గా నయీం అస్మీ బదిలీ
కాకినాడ క్రైం, జూలై7 : జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా ఐపీఎస్ అధికారి ఎం.రవీంద్రనాధ్‌బాబును నియమి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విజయవాడ డీసీపీ (అడ్మిన్)గా పనిచేస్తున్న రవీంద్రనాథ్‌బాబును సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడకు బదిలీ చేశారు. రవీంద్రనాథ్‌బాబు సొంత జిల్లా కడప. 2001 బ్యాచ్ గ్రూప్-1 అధికారిగా పోలీస్‌శాఖలో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. పలుచోట్ల డీఎస్పీగా పని చేసిన అనంతరం 2015లో ప్రభుత్వం ఐపీఎస్‌గా కన్‌ఫర్డ్‌గా ప్రమోట్ చేసింది. విజయవాడ విజిలెన్స్ జోనల్ ఎస్పీగా పని చేశారు. అనంతరం విజయవాడ డీసీపీగా పనిచేస్తున్న రవీంద్రనాథ్‌బాబును జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. ఇక్కడ ఎస్పీగా పని చేస్తున్న అద్నాన్ నయీంఅస్మీని విజయవాడ గ్రేహౌండ్స్ కమాండెంట్‌గా బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
రంపచోడవరం ఏఎస్పీగా కృష్ణకాంత్ పాటిల్
రంపచోడవరం, జూలై 7 : రంపచోడవరం ఏఎస్పీగా కృష్ణకాంత్ పాటిల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఐపీఎస్ 2018 బ్యాచ్ చెందిన ఆయన అస్టాల్, గ్రేహౌండ్స్ కమాండర్‌గా పనిచేసి బదిలీపై ఇక్కడ కు రానున్నారు. ఇక్కడ పనిచేసిన బిందుమాధవ్ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఏఎస్పీగా బదిలీ అయ్యారు.
చింతూరు ఏఎస్పీగా జి.కృష్ణకాంత్
చింతూరు, జులై 7 : చింతూరు ఏఎస్పీగా జి.కృష్ణకాంత్ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2017 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కృష్ణకాంత్ ఇప్పటివరకు గ్రేహౌండ్సు కమాండర్‌గా పనిచేశారు.