సమాజంలో పోలీసుల సేవలు అమూల్యం

ABN , First Publish Date - 2021-10-28T05:51:45+05:30 IST

సమాజంలో శాంతిభద్రతలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసుల సేవలు అమూల్యమైనవని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ అన్నారు

సమాజంలో పోలీసుల సేవలు అమూల్యం

 ఎమ్మెల్యే పర్వత, పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు

ఏలేశ్వరం, అక్టోబరు 27: సమాజంలో శాంతిభద్రతలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసుల సేవలు అమూల్యమైనవని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రత్తిపాడు పోలీసు సర్కిల్‌ ఆధ్వర్యంలో ఏలేశ్వరంలో ఉచిత మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు.  ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఈ శిబిరాన్ని పెద్దాపురం డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, సీఐ సురేష్‌బాబులతో కలసి ముఖ్యఅతిఽథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రారంభించారు. 100 మంది యువతీ, యువకులు రక్తదానం చేశారు. రాజమహేంద్రవరం బ్లడ్‌బ్యాంక్‌ సిబ్బంది రక్తాన్ని సేకరించారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటైన సభలో ఎమ్మెల్యే, డీఎస్పీ తదితరులు విధి నిర్వహణలో అశువులు బాసిన అమరవీరులైన పోలీసులకు నివాళులలర్పించారు. పలు పాఠశాలల విద్యార్ధులతో నిర్వహించిన ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమంలో వారు పాల్గొని పోలీసులు విఽధులు తదితర పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  వైద్యాధికారి రామలక్ష్మి, ప్రజాప్రతినిధులు ఎ.చలమయ్య, బి.గోవిందు, ఎస్‌.వెంకటేశ్వరావు, తహశీల్ధార్‌ రజనీకుమారీ, ఎస్‌ఐలు సీహెచ్‌.విద్యాసాగర్‌, కె.సుధాకర్‌, రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-28T05:51:45+05:30 IST