సోషల్‌ మీడియా కేసులో బెయిల్‌

ABN , First Publish Date - 2021-12-19T07:01:07+05:30 IST

సోషల్‌ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే కారణంతో సీఐడీ అరెస్టు చేసిన తెలుగునాడు స్టేట్‌ ఫెడరేషన్‌ సోషల్‌ మీడి యా కోఆర్డినేటర్‌ వెల్లపు సంతోషరావు, బి.కోదండరామ్‌లకు విజయవాడ మూడవ మెట్రోపాలిటన్‌ కోర్టులో బెయిల్‌ లభించింది.

సోషల్‌ మీడియా కేసులో బెయిల్‌

సీఐకు కోర్టు మెమో

రాజమహేంద్రవరం, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే కారణంతో సీఐడీ అరెస్టు చేసిన తెలుగునాడు స్టేట్‌ ఫెడరేషన్‌ సోషల్‌ మీడి యా కోఆర్డినేటర్‌ వెల్లపు సంతోషరావు, బి.కోదండరామ్‌లకు విజయవాడ మూడవ మెట్రోపాలిటన్‌ కోర్టులో బెయిల్‌ లభించింది. వ్యక్తిగత పూచీకత్తుతో న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. పైగా అరెస్టు చేసిన 24 గంటలలోపు ఎందుకు కోర్టుకు హాజరుపరచలేదని సీఐడీ సీఐని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో ఏడు రోజులుగా సమాధానం చెప్పాలని మెమో జారీ చేసినట్టు ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు.



Updated Date - 2021-12-19T07:01:07+05:30 IST