షాపింగ్‌ మాల్స్‌లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2021-07-11T05:21:01+05:30 IST

రాజమహేంద్రవరంలో కొన్ని షాపింగ్‌ మాల్స్‌ను జిల్లా పుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌కె చక్రవర్తి, జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

షాపింగ్‌ మాల్స్‌లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీలు

రాజమహేంద్రవరం సిటీ, జూలై 10: రాజమహేంద్రవరంలో కొన్ని షాపింగ్‌ మాల్స్‌ను జిల్లా పుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌కె చక్రవర్తి, జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజమహేంద్రవరంలోని పలు షాపింగ్‌ మాల్స్‌ను, సూపర్‌మార్కెట్లో నిబంధనలు అతిక్రమిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు చేసి నట్టు చక్రవర్తి చెప్పారు. ఆహార పదార్థాల శాంపిల్స్‌ తీసుకుంటున్నామని వచ్చిన రిపోర్టు ఆధారంగా ఆయా షాపింగ్‌ మాల్స్‌కు నోటీసులు జారీ చేస్తా మన్నారు. అనంతరావు మాట్లాడుతూ  వినియోగదారులకు నాణ్యమైన ఆహా రం అందించాలని, ఆహారభద్రత పాటించాలని చెప్పారు. ఆహార పదార్థాల ప్యాకెట్లపై తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీ తప్పనిసరిగా ఉండేలా నిర్వాహకులు చూసుకోవాలని సూచించారు.

Updated Date - 2021-07-11T05:21:01+05:30 IST