ఎల్‌ఐసీలో వాటాల విక్రయానికి ఏఐఐఈఏ వ్యతిరేకం

ABN , First Publish Date - 2021-12-20T05:10:35+05:30 IST

ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడమే కాకుండా, ఎల్‌ఐసీలో ఐపీవో పేరుతో ప్రభుత్వ వాటాలు అమ్మడానికి సాధారణ బీమా సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏఐఐఈఏ) వ్యతిరేకిస్తోందని ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘ నాయకుడు పులగుర్త సాయిబాబా ఓ ప్రకటనలో చెప్పారు.

ఎల్‌ఐసీలో వాటాల విక్రయానికి ఏఐఐఈఏ వ్యతిరేకం

రాజమహేంద్రవరం రూరల్‌, డిసెంబరు 19: ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడమే కాకుండా, ఎల్‌ఐసీలో ఐపీవో పేరుతో ప్రభుత్వ వాటాలు అమ్మడానికి సాధారణ బీమా సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏఐఐఈఏ) వ్యతిరేకిస్తోందని ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘ నాయకుడు పులగుర్త సాయిబాబా ఓ ప్రకటనలో చెప్పారు. ప్రభుత్వం సంపన్నులపై ఎక్కువ పన్ను విధించడానికి బదులుగా ప్రభుత్వ ఆస్తు లను కార్పొరేట్లు, ధనిక వర్గాలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇది ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ స్పూర్తి’కి పూర్తి విరుద్ధమని అన్నారు. ప్రభుత్వం పెట్టిన రూ.100 కోట్ల మూలధనానికి ఎల్‌ఐసీ ఇప్పటివరకు దాదాపు రూ.28 వేల కోట్లు డెవిడెండ్‌గా ఇచ్చిందని, ప్రతీ ఏడాది ఎల్‌ఐసీ లాభాల్లో 5శాతం ప్రభుత్వానికి డెవిడెండ్‌ రూపంలో, మిగిలిన 95శాతం పాలసీదారులకు బోనస్‌గా పంపిణీ చేస్తుందని సాయిబాబా చెప్పారు. స్టాక్‌మార్కెట్లో ఎల్‌ఐసీ లిస్టింగ్‌ను ఉపసంహరించుకోవాలన్నారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితి 49శాతం నుంచి 74శాతానికి పెంచడాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. బీమా ప్రీమియంపై జీఎస్‌టీ తొలగించాలని సాయిబాబా అన్నారు.

Updated Date - 2021-12-20T05:10:35+05:30 IST