విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దు

ABN , First Publish Date - 2021-10-28T06:47:51+05:30 IST

కాకినాడ మల్లాడి సత్యలింగనాయకర్‌ విద్యార్థుల కోసం తన ఆస్తినంతటిని ధారాదత్తం చేస్తే, అలాంటి ఆస్తిని ప్రభుత్వం లాగేసుకోవాలని చూస్తోంది.

విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దు
ఎయిడెడ్‌ విలీనంపై ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన

ఎయిడెడ్‌ విలీనంపై ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన
భానుగుడి (కాకినాడ), అక్టోబరు 27: కాకినాడ మల్లాడి సత్యలింగనాయకర్‌ విద్యార్థుల కోసం తన ఆస్తినంతటిని ధారాదత్తం చేస్తే, అలాంటి ఆస్తిని ప్రభుత్వం లాగేసుకోవాలని చూస్తోంది. ప్రభుత్వం విలీనం పేరుతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవద్దంటూ కాకినాడ జగన్నాథపురం ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌లో చదువుతున్న విద్యార్థులతో కలిసి ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి సూరిబాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మూడు గంటలపాటు విద్యార్థులు తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి టి రాజా మాట్లాడుతూ ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యా సంస్థలను విలీనం చేయాలని చూస్తుందేగానీ విద్యార్థుల జీవితాలను గాలికి వది లేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణం తన ఆలోచనను వెనక్కు తీసుకోవా లని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మణికింఠ, ఓంకార్‌, వినేశ్వరి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T06:47:51+05:30 IST