షెడ్డు తొలగింపు

ABN , First Publish Date - 2021-08-25T06:20:07+05:30 IST

దాత ఇచ్చిన స్థలంలో నిర్మి ంచిన పశువుల షెడ్డును ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారీ పోలీసు బందోబస్తు మధ్య మంగళవారం తొలగించారు

షెడ్డు తొలగింపు

 చెందుర్తిలో ఉద్రిక్తత

గొల్లప్రోలురూరల్‌, ఆగస్టు 24: దాత ఇచ్చిన స్థలంలో నిర్మి ంచిన పశువుల షెడ్డును ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారీ పోలీసు బందోబస్తు మధ్య మంగళవారం తొలగించారు.  గొల్లప్రో లు మండలం చెందుర్తిలోని ప ది సెంట్లు స్థలాన్ని గ్రామానికి చెందిన బుద్దరాజు సత్యనారాయణమ్మ ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీకి కొన్ని సంవత్సరాల క్రితం దానపట్టా ద్వారా రాసివ్వగా హెల్త్‌వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్మాణానికి ఇటీవల గ్రామపంచాయతీ తీర్మానించింది. ఇదే స్థలంలో దాత కుటుంబసభ్యులకు చెందిన పశువుల షెడ్డు ఉండటంతో తొలగించాలని గ్రామపంచాయతీ సర్పంచ్‌ అల్లి పాప తదితరులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో, ఆయన ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం తొలగించాలని ప్రయత్నించగా దాత కుటుంబానికి చెందిన వ్యక్తి, మరి కొందరు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో కాకినాడ సబ్‌ డివిజన్‌కు చెందిన ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్‌ఐలు తదితరులతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి పశువుల షెడ్డును కూల్చివేశారు. అడ్డుకునేందుకు దాత కుటుంబసభ్యుడు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకుని కొత్తపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. తొలగింపు ప్రక్రియతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. షెడ్డును తొలగించుకునేందుకు మూడు రోజులు సమయం ఇవ్వాలని అడిగినా ఇవ్వకుండా అధికారులు బలవంతంగా షెడ్డును కూల్చివేశారని దాత కుటుంబ సభ్యులు ఆరోపించారు. గొల్లప్రోలు తహశీల్దారు అమ్మాజీ, పిఠాపురం, కాకినాడ రూరల్‌, పోర్టు సీఐలు వైఆర్‌కే శ్రీనివాసరావు, మురళీకృష్ణ, శ్రీనివాస్‌ పరిస్థితిని పర్యవేక్షించారు.



Updated Date - 2021-08-25T06:20:07+05:30 IST