దళితులపై దాడులు.. టీడీపీ ఆందోళన

ABN , First Publish Date - 2021-08-21T06:16:14+05:30 IST

దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రావులపాలెం టీడీపీ కార్యాలయం వద్ద అమలాపురం పార్లమెంటు తెలుగు యువత అధ్య క్షుడు చిలువూరి సతీష్‌రాజు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు.

దళితులపై దాడులు.. టీడీపీ ఆందోళన

రావులపాలెం రూరల్‌, ఆగస్టు 20: దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రావులపాలెం టీడీపీ కార్యాలయం వద్ద అమలాపురం పార్లమెంటు తెలుగు యువత అధ్య క్షుడు చిలువూరి సతీష్‌రాజు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా సతీష్‌రాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళతులపై వరుస దాడులు జరుగుతున్నా మన్నారు. కార్యక్రమంలో గుత్తుల పట్టాభిరామారావు, మాసాబత్తుల ఆనం దరావు, కాసురెడ్డితోపాటు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-21T06:16:14+05:30 IST