స్కూల్‌ టైమింగ్స్‌ మారాయి : డీఈవో

ABN , First Publish Date - 2021-02-05T07:58:10+05:30 IST

జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల సమయ వేళలు ఈనెల 5 నుంచి మారుస్తున్నట్టు డీఈవో ఎస్‌ అబ్రహం తెలిపారు.

స్కూల్‌ టైమింగ్స్‌ మారాయి : డీఈవో

కాకినాడ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల సమయ వేళలు ఈనెల 5 నుంచి మారుస్తున్నట్టు డీఈవో ఎస్‌ అబ్రహం తెలిపారు. దీంతో శుక్రవారం నుంచి ఉన్నత, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలన్నీ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. అయితే సాయంత్రం 3.30 గంటలకు ప్రాథమిక పాఠశాలలు, సాయంత్రం 4 గంటల వరకూ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు పనిచేస్తాయన్నారు. వేళలు పెంచినా, తగ్గించినా ప్రభుత్వాదేశాల మేరకు ఆయా పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2021-02-05T07:58:10+05:30 IST