బిక్కవోలులో జనజాతర
ABN , First Publish Date - 2021-12-10T05:27:23+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన బిక్కవోలు శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది.

బిక్కవోలు, డిసెంబరు 9: తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన బిక్కవోలు శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి లక్ష మందికి పైగా భక్తులు రావడంతో బిక్కవోలు భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున 1.15 గంటలకు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జంగా వీరవెంకటసుబ్బారెడ్డి తీర్థపు బిందె సేవతో ఉత్సవాలను ప్రారంభించారు. అప్పటి నుంచి భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. సంతానార్థులైన స్త్రీలు నాగుల చీరలను స్వామి చెంతనే వున్న పుట్టపై వుంచి వాటిని ధరించి ఆలయం వెనుక శయనించారు. స్వామివారిని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి-ఆదిలక్ష్మి దంపతులు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, రుడా చైర్మన్ మేడపాటి షర్మిల-అనిల్‌రెడ్డి దంపతులు, ఏపీ వ్యవసాయ మిషన్ సభ్యుడు కొవ్వూరి త్రినాఽథరెడ్డి, రాజమహేంద్రవరం డీఎల్పీవో సత్యనారాయణ దర్శించుకున్నారు.